Saturday, February 22, 2014

కవితా సారం

__________


పుష్యమి సాగర్ గారు సాహితి సేవ లో  రాసిన కవిత సారం , నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. అందుకు సాగర్ గారికి చాల ఋణపడి  ఉంటాను .

కృష్ణ మణి గారు రచించిన "అంగడి "

పూర్వ కాలం లో, రైతులు, వ్యాపారాలు, నెలకు సరిపడా వెచ్చాలను .కొనుక్కునేందుకు ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ కుప్పలు గా తమ తమ వస్తువులను, పంటలను ..మరి ఇతర వాటిని అమ్ముకొని లేదు కొనుక్కేనే ప్రదేశాన్ని అంగడి అంటారు, ఇప్పుడిలా సూపర్ మార్కెట్ లు .మాల్స్ లో దొరికినట్టు వారానికి ఒక రోజు "అంగడి" లేదు "సంత " జరిగేది ..ఇప్పట్టికి కొన్ని గ్రామాలలో కన్పిస్తుంది ...

అలాంటి అంగడి లో ...ఒక రోజు కష్ట జీవుల బతుకు చిత్రాన్ని మాండలికం లో అందం గా గూర్చి పేర్చారు ..కృష్ణ గారు, .. 

తము పండించిన పంట ని తీసుకొచ్చే క్రమం లో రేగిన దుమ్ము సంత లో ...కన్పించగా..నాలుగు ఊళ్ళ నుంచి శ్రమ జీవులు ఒక్కటయి తమ పంటను రాసులు గా పోసి కూసుంటారు ...నిజమే...పడ్డ కష్టాని కి ఫలితం దక్కాలి అంటే ...అమ్మకాలు జరగవలసిందే కదా...

దుమ్ము ఆకసమంటే //మాఊరి అంగడిల !//నాలుగూర్ల కష్టజీవులు //ఒక్కటైన దినాన 
ఎడ్లబండ్లు దింపి //కుప్పలన్ని పేర్శి //నడితోవ్వల కూసుందురు 

అలాగే ..ఓ మంచి మాట ని వాడారు ..."పొద్దెక్కనియ్యని కాయదొరలు " అవును, రైతులు తమ తమ కూరగాయలను పొద్దుగూకే లోపు అమ్ముకొని వెళ్ళాలి కదా , మరి పంటకి రైతే రాజు కూడా ...

ఆ రోజు మొదలు అయ్యే దినచర్య చోటు ని ...వాటి లో జరిగీ బేరా సారాలను ...ప్రేమ అనుబందం తో ఎలా తమ వస్తువలని కాని పంట ని కాని అమ్మకాలు సాగిస్తారో ...తను పండించిన పంట లేదు తయారు చేసిన వస్తువు అయిన కుడా...ఏ మాత్రం పొగరు లేకుండా ...వినియోగదారుడే దేవుడు అన్న సూత్రాన్ని నమ్ముతూ ముందుకు సాగుతుఆదు శ్రామిక జీవి...

జనం నిండెను సూడు //బ్యారమాడే సోట !//అన్నా అని పడతి //ఇంతకిమ్మని మారం //రాదు షెల్లే అని //గుండె ఒంపిన ప్రేమ 
పొగరు మాటా రాని //చెమట చిందిన దాత !

మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యమైన పని లో వున్నప్పుడు మన స్నేహితులు కాని, బందువు కాని కలిసినపుడు కష్ట సుఖం చెప్పుకుంటాం, అప్పుడు మనం ఎంత వత్తిడి లో వున్నా కూడా రిలీఫ్ ఆ ఫీల్ ఆటం ...నిజమే కదా ....శ్రమ జీవి కూడా అంతే అని కవి గారి అబిప్రాయం ...

సుట్టమేమో కలిశే /పానమైన పలుకు /
కష్టసుఖము మాట /అల్కగైనా బరువు !

మరి సంత లో సాయంత్రం దాక తిండి తిప్పలు లేకుండా తన కష్టాన్ని అమ్ముకొని ...మొత్తం లో ఎంత మిగులు ఉన్నదో చూసినప్పుడు దిగులు నిండిన కనులతో తిరిగి వెళ్తాడు కదా...అయిన మిగిలిన వాటిని తన దగ్గర ఉంచలేదు ...అలాగా అని పారేయను లేదు కడ.అ...అది తలచుకొని ...కళ్ళ నీళ్ళు పెడతాడు ...
తిండి తిప్పలు మాని //మూటలన్నీ పోంగ//మిగిల్నయాటిని చూసి ..కంట్ల నీరే నిండె !..

పొద్దు గుంకిన తరువాత అలసి సొలసి తిరుగు బండ్లు కట్టి తమ తమ వాళ్ళని తలచుకుంటూ ...లాభ నష్టాలని మననం చేసుకుంటూ ఇంటి కి బయలుదేరతాడు ...సగటు రైతు, లేదు ..వ్యాపారి అంటూ చక్కని ముగింపు నిచ్చారు ...కృష్ణ మణి గారు. 

పొద్దు ఒయే యాల //తిరుగు బండ్లను కట్టి 
పానమలసిన జీవి //కడుపున కళ్ళు ఓషి 
ఇంటి తొవ్వ వట్టె //పెండ్లాంపిల్లలు ఎదురుసూడ !

కృష్ణ గారికి మాండలికం లో మంచి పట్టు వున్నది ...వారి పూర్వపు కవితల్లో సామాజిక అంశాలను ఎన్నో మన ముందుకు తెచ్చారు ...కవి కి సామజిక బాద్యత ..వుండాలని ..అపుడే చైతన్యం వస్తుంది అని నమ్మినవారు...మరుగున పడిన మన ఊరి ముచ్చట్ల ను ...సంత లను ...అంగడి ల ను ఈ తరానికి పరిచయం చేసిన కృష్ణ గారికి అబినందనలు ...
వారు మరెన్నో మంచి కవితలు రాయాలని కోరుతూ ..

సెలవు ...

ఆదివారం నాడు 
దుమ్ము ఆకసమంటే 
మాఊరి అంగడిల !

నాలుగూర్ల కష్టజీవులు 
ఒక్కటైన దినాన 
ఎడ్లబండ్లు దింపి 
కుప్పలన్ని పేర్శి 
నడితోవ్వల కూసుందురు 
పొద్దెక్కనియ్యని కాయదొరలు !

జనం నిండెను సూడు 
బ్యారమాడే సోట !

అన్నా అని పడతి 
ఇంతకిమ్మని మారం 
రాదు షెల్లే అని 
గుండె ఒంపిన ప్రేమ 
పొగరు మాటా రాని 
చెమట చిందిన దాత !

సుట్టమేమో కలిశే 
పానమైన పలుకు 
కష్టసుఖము మాట 
అల్కగైనా బరువు !

తిండి తిప్పలు మాని 
మూటలన్నీ పోంగ
మిగిల్నయాటిని చూసి 
కంట్ల నీరే నిండె !

పొద్దు ఒయే యాల 
తిరుగు బండ్లను కట్టి 
పానమలసిన జీవి 
కడుపున కళ్ళు ఓషి 
ఇంటి తొవ్వ వట్టె 
పెండ్లాంపిల్లలు ఎదురుసూడ !

No comments:

Post a Comment