అడవి కొమ్మలపై ఎర్రని పూలు
రాలుతున్న కొద్ది పెరుగుతున్నాయి
పూసిన పూలు రాలిన పూలను
చూసి
బాటలో దివిటి కాకలు
త్యాగాలకు ప్రతిరూపాలు
జనంలో జెండాలను పాతి
వనంలో పరిమళాల సొగసు కాడలై
మా అందరి మదిలో వెలుగుదివ్వెలై
నడిపింతురు నాగలి ముల్లులై
దున్నేదుము కలుపు గుట్టల
సాగు పంటకొచ్చు దాక
ప్రాణాలను ఎరువులు చేస్తాం
బడుగుల జాతర చేయ
మీ అడుగులే ఆధారం
No comments:
Post a Comment