Thursday, February 27, 2014

బాటసారి


********
గమ్యం తెలియని బాటసారిని
ప్రశ్నలు గుప్పిస్తుంది నడక ఆగక
దారులు కనిపిస్తున్నాయి  
ఎటెల్లాలో ?

దేహం అలసి ఊగుతుంది విసుగ్గా
కళ్ళు చిట్లించుకొంటున్నాయి ఇంకెంతని చూడాలని
ఎలుకల గోలకు మసలుతుంది కడుపు ఎంతకాలం ఈ పాట్లని
గడచిన దారిలో ఎండమావులే ఎక్కిరించగా
నడిచే బాటలో పువ్వులు ముడిచి ముళ్ళే పొడిచెను !

తడబడు అడుగుల
గజిబిజి మనసున
మాసిన మొఖమున
సాగని బతుకున  
ఆగని గుండెను
ఆపే పోరులో   
గెలుతును నేనని
చేసిన బాసలో 
ఓడిన తనమున
ముడిచితి తనువును !

పోవుట తప్పక
నేర్చిన నడకన 
రేపటి సంతకు 
కాగడ వెలుతురు
కాన కొనకు !


కృష్ణ మణి I 

నా తోడు


***********
కనపడని నీడ నా చుట్టూ
నిస్సందేహం !
తల్లి గర్భాన మొలచిన చోటనే
అది నా తోడు
పగలు రాత్రి తేడ లేదు
తొలిసారి అమ్మా అన్నప్పుడూ
తొలిసారి ఒక్కన్నే బయటికొచ్చినప్పుడూ
నా నీడకు ఒక నీడ జతైనప్పుడూ
ప్రతి కర్మను ప్రశ్నిస్తూ
మంచిని తడుతూ
చెడుని తోడుతూ
తడబడు అడుగుల చూస్తూ
గమ్యానికి పాదులు వేస్తూ
అన్నీ వేళల వెంట నడుచును !

కనిపించే నీడే నా ఆత్మ అయితే
కనిపించని నీడ పరమాత్మ !

కృష్ణ మణి I 27-02-2014


Wednesday, February 26, 2014

విరహ గీతం

నా తలపున విరహ గీతం
నా గుండెల ప్రేమ దీపం

పువ్వు పైనే ఆటలాడు తెనెదొంగ
తనివి తీర ఆరగించి మురిసిపొగ
నీ ప్రేమ పొంగు క్షణముకైనా నోచుకోనా !

చూపు వాలిన మురిసి పోతా పాపలాగా
నీ కంటిపాపలో ఉండనీ కలకాలం  
నా గుండె గూటిలో ఒదిగిపో చిరకాలం !

వేచి  వుండే  స్వాతి  పిట్టలా  ..
కాలాలు గడిపేస్తా ఆశగా ..
నీకై చివరి శ్వాస దాకా .  !


Krishna Mani

Monday, February 24, 2014

బస్ స్టాప్

***********
సమయం పదిన్నర బస్ స్టాప్ లో నేను
వస్తానన్న మిత్రుడికై ఎదురుచూపులు
అన్న టైముకు ముందుగానే
నాకై ఉంటాడని ఆశ పడితి
కాని వెయిట్ చేయిస్తాడని అనుకోలేదు
రింగ్ చేస్తే పది నిమిషాల్లో అన్నాడు  !

అసలే టిఫిను పడలేదు
వస్తాడులే అని అటు ఇటుగా వస్తున్న యవ్వన పరిమాలలను
కన్నులతో ఆస్వాదిస్తూ రెప్ప తెరచి కళలు కంటున్నాను
వేసుకున్న పౌడరు చమటతో తడిసి చారలు పడ్డాయి
పక్కన పానిపూరి పిలుస్తుంది
ఆకలేస్తుంది
వాడొస్తే లేటుగా వచ్చినందుకు టోపీ పెడతానని ధీమ !

మల్లి రింగ్ చేస్తే ఇంకో పది అన్నాడు
అంతలనే ఎదురుగా బిచ్చగాడు
చెయ్యి స్టైలుగా ప్యాంటులో దూరింది
చినిగిన పర్సు తీసి చిల్లర వెతికి
ఒక్క రూపాయి అని
పక్కన అమ్మాయిని చూస్తూ బొచ్చలో వేస్తె
‘’యాబై పైసలకే ఇంత పొజా ‘’అంటూ
మొహం చిట్లించాడు బెగ్గరు సారు !

చెదిరిన ఇంషర్ట్ ను సర్దుతూ
ఇంతకీ రాలేడని వచ్చే పోయే ఆటోల్లోకి తొంగి చూపులు
‘’ఎక్కడికి సార్’’ అని ఒక ఆటో డ్రైవర్
ఏమని చెప్పను వాడికి నా బాధ
‘’పోయిరా సామి’’ అని సాగనంపాను

ఆ నల్ల చొక్కవాడు మావాడేనా ?
ఈ పచ్చ చొక్క వాడేనా  ?
జనాలకేసి చూసి చూసి కండ్లు మండుతున్నై
అయినా రాడు !

పక్కన ఓ బుల్లి పాప ఐస్క్రీం తింటుంది
నా చూపులకి ఎక్కడ అడుగుతానేమోనని
భయంతో ‘’మమ్మీ’’ అని ఏడుపు
తల్లి నాకేసి ‘’దొంగ కోడుకులు’ అని తిడుతుంది
ఏమి నా కర్మ
మావాడు రాడు !

ఇప్పుడైతే ఫోన్ ఎత్తట్లేదు
తల్లోంచి చమట నూనె తెల్ల చొక్కని మురికి చేస్తుంది
అసలే ఫ్రెండు పెళ్లి పదకొండు గంటలకి
ఇప్పుడు దాదాపు ఒకటి
మావాడు రాడు !

తిరిగి వెనక్కి వెళ్దాం అంటే మనసు వినదు
రూముకెళ్తే వంట చేసుకోవాలి
పెల్లికి ఎల్తె పంచ భక్ష పరమాన్నాలు
ఆకలి సమయం మొహం పీక్కుపోయింది
ఏదైనా కొనుక్కు తిందాం అంటే జేబులో
గల గల మని చిల్లర శబ్దం ఎక్కిరిస్తుంది !

మొత్తానికి వచ్చాడు మావాడు
అదిరిపోయే ఎత్నిక్ డ్రెస్సులో
పల్సర్ బండిపై
వస్తూనే ఎక్కడ తిడతానని ముందుగానే ‘‘సారి రా మామ’’
అంతలోనే ఇంకో సటైరు
‘’ఏం డ్రెస్సురా మామ నీది ‘’
చిత్రమైన స్తితిలో తర్వాతి విషయం ఇక చెప్పలేను !

కృష్ణ మణి I 28-02-2014


Saturday, February 22, 2014

కవితా సారం

__________


పుష్యమి సాగర్ గారు సాహితి సేవ లో  రాసిన కవిత సారం , నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. అందుకు సాగర్ గారికి చాల ఋణపడి  ఉంటాను .

కృష్ణ మణి గారు రచించిన "అంగడి "

పూర్వ కాలం లో, రైతులు, వ్యాపారాలు, నెలకు సరిపడా వెచ్చాలను .కొనుక్కునేందుకు ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ కుప్పలు గా తమ తమ వస్తువులను, పంటలను ..మరి ఇతర వాటిని అమ్ముకొని లేదు కొనుక్కేనే ప్రదేశాన్ని అంగడి అంటారు, ఇప్పుడిలా సూపర్ మార్కెట్ లు .మాల్స్ లో దొరికినట్టు వారానికి ఒక రోజు "అంగడి" లేదు "సంత " జరిగేది ..ఇప్పట్టికి కొన్ని గ్రామాలలో కన్పిస్తుంది ...

అలాంటి అంగడి లో ...ఒక రోజు కష్ట జీవుల బతుకు చిత్రాన్ని మాండలికం లో అందం గా గూర్చి పేర్చారు ..కృష్ణ గారు, .. 

తము పండించిన పంట ని తీసుకొచ్చే క్రమం లో రేగిన దుమ్ము సంత లో ...కన్పించగా..నాలుగు ఊళ్ళ నుంచి శ్రమ జీవులు ఒక్కటయి తమ పంటను రాసులు గా పోసి కూసుంటారు ...నిజమే...పడ్డ కష్టాని కి ఫలితం దక్కాలి అంటే ...అమ్మకాలు జరగవలసిందే కదా...

దుమ్ము ఆకసమంటే //మాఊరి అంగడిల !//నాలుగూర్ల కష్టజీవులు //ఒక్కటైన దినాన 
ఎడ్లబండ్లు దింపి //కుప్పలన్ని పేర్శి //నడితోవ్వల కూసుందురు 

అలాగే ..ఓ మంచి మాట ని వాడారు ..."పొద్దెక్కనియ్యని కాయదొరలు " అవును, రైతులు తమ తమ కూరగాయలను పొద్దుగూకే లోపు అమ్ముకొని వెళ్ళాలి కదా , మరి పంటకి రైతే రాజు కూడా ...

ఆ రోజు మొదలు అయ్యే దినచర్య చోటు ని ...వాటి లో జరిగీ బేరా సారాలను ...ప్రేమ అనుబందం తో ఎలా తమ వస్తువలని కాని పంట ని కాని అమ్మకాలు సాగిస్తారో ...తను పండించిన పంట లేదు తయారు చేసిన వస్తువు అయిన కుడా...ఏ మాత్రం పొగరు లేకుండా ...వినియోగదారుడే దేవుడు అన్న సూత్రాన్ని నమ్ముతూ ముందుకు సాగుతుఆదు శ్రామిక జీవి...

జనం నిండెను సూడు //బ్యారమాడే సోట !//అన్నా అని పడతి //ఇంతకిమ్మని మారం //రాదు షెల్లే అని //గుండె ఒంపిన ప్రేమ 
పొగరు మాటా రాని //చెమట చిందిన దాత !

మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యమైన పని లో వున్నప్పుడు మన స్నేహితులు కాని, బందువు కాని కలిసినపుడు కష్ట సుఖం చెప్పుకుంటాం, అప్పుడు మనం ఎంత వత్తిడి లో వున్నా కూడా రిలీఫ్ ఆ ఫీల్ ఆటం ...నిజమే కదా ....శ్రమ జీవి కూడా అంతే అని కవి గారి అబిప్రాయం ...

సుట్టమేమో కలిశే /పానమైన పలుకు /
కష్టసుఖము మాట /అల్కగైనా బరువు !

మరి సంత లో సాయంత్రం దాక తిండి తిప్పలు లేకుండా తన కష్టాన్ని అమ్ముకొని ...మొత్తం లో ఎంత మిగులు ఉన్నదో చూసినప్పుడు దిగులు నిండిన కనులతో తిరిగి వెళ్తాడు కదా...అయిన మిగిలిన వాటిని తన దగ్గర ఉంచలేదు ...అలాగా అని పారేయను లేదు కడ.అ...అది తలచుకొని ...కళ్ళ నీళ్ళు పెడతాడు ...
తిండి తిప్పలు మాని //మూటలన్నీ పోంగ//మిగిల్నయాటిని చూసి ..కంట్ల నీరే నిండె !..

పొద్దు గుంకిన తరువాత అలసి సొలసి తిరుగు బండ్లు కట్టి తమ తమ వాళ్ళని తలచుకుంటూ ...లాభ నష్టాలని మననం చేసుకుంటూ ఇంటి కి బయలుదేరతాడు ...సగటు రైతు, లేదు ..వ్యాపారి అంటూ చక్కని ముగింపు నిచ్చారు ...కృష్ణ మణి గారు. 

పొద్దు ఒయే యాల //తిరుగు బండ్లను కట్టి 
పానమలసిన జీవి //కడుపున కళ్ళు ఓషి 
ఇంటి తొవ్వ వట్టె //పెండ్లాంపిల్లలు ఎదురుసూడ !

కృష్ణ గారికి మాండలికం లో మంచి పట్టు వున్నది ...వారి పూర్వపు కవితల్లో సామాజిక అంశాలను ఎన్నో మన ముందుకు తెచ్చారు ...కవి కి సామజిక బాద్యత ..వుండాలని ..అపుడే చైతన్యం వస్తుంది అని నమ్మినవారు...మరుగున పడిన మన ఊరి ముచ్చట్ల ను ...సంత లను ...అంగడి ల ను ఈ తరానికి పరిచయం చేసిన కృష్ణ గారికి అబినందనలు ...
వారు మరెన్నో మంచి కవితలు రాయాలని కోరుతూ ..

సెలవు ...

ఆదివారం నాడు 
దుమ్ము ఆకసమంటే 
మాఊరి అంగడిల !

నాలుగూర్ల కష్టజీవులు 
ఒక్కటైన దినాన 
ఎడ్లబండ్లు దింపి 
కుప్పలన్ని పేర్శి 
నడితోవ్వల కూసుందురు 
పొద్దెక్కనియ్యని కాయదొరలు !

జనం నిండెను సూడు 
బ్యారమాడే సోట !

అన్నా అని పడతి 
ఇంతకిమ్మని మారం 
రాదు షెల్లే అని 
గుండె ఒంపిన ప్రేమ 
పొగరు మాటా రాని 
చెమట చిందిన దాత !

సుట్టమేమో కలిశే 
పానమైన పలుకు 
కష్టసుఖము మాట 
అల్కగైనా బరువు !

తిండి తిప్పలు మాని 
మూటలన్నీ పోంగ
మిగిల్నయాటిని చూసి 
కంట్ల నీరే నిండె !

పొద్దు ఒయే యాల 
తిరుగు బండ్లను కట్టి 
పానమలసిన జీవి 
కడుపున కళ్ళు ఓషి 
ఇంటి తొవ్వ వట్టె 
పెండ్లాంపిల్లలు ఎదురుసూడ !

ఆకలి ప్రేమ

ఆకలి ప్రేమ
____________కృష్ణ మణి

మా అమ్మ ఎక్కడుందో ?
నా తల్లి ఎలా వుంటుందో ?
అని తోడబుట్టినోల్ల తోడుగా
ఆకలి కేకలకు అదిరిన గుండె నాది !

అటు ఇటు ఎటు పోదూ ?
నడక తెలియని అమాయకత్వం
అరుపుతో నైన పిలువనా ?
కాని ఏమని ?
నోరు పెకలదే ... ఎట్లా
కళ్ళు తెరిచే శక్తి లేదు
అది రాత్రో పగలో తెలియదు
ఉన్నది మట్టిపైనో లేక రాయిపైనో తెలియదు
ఉన్నది నీడలోనా లేక ఎండలోనా అర్ధం కాదు
తల్లి రాకకై పడిగాపులు

అమ్మ వచ్చింది
అందరిని దగ్గర తీసింది
బిరబిరామని పోటి పరుగున
ఆ పాల ధారను అందుకొని
అలసిన డొక్కల నింపు సమయాన
ముక్కు నాలుకతో మమ్ము తడిమి
చూపుతున్న ప్రేమ జల్లులో తడుస్తూ
ఎరుగని ఆప్యాయతలో ఒదిగినం
మమ్మోదిలి ఎళ్లకే అమ్మా అని
గట్టిగా హత్తుకొని ములిగినం


కృష్ణ మణి

గబ్బిలాల జాతర


*************

ఎన్నెన్నో కలలు
నెరవేరే గడియన
గబ్బిలాల జాతరతో
గబ్బులేషిన లోకాన
యవ్వన కాంతుల
తడబడు అడుగులు
ఓర్వని జంతులు
విసిరిన పంజలో  
చిక్కేను బేలలు !

కారిన కన్నులు
జారిన దాపులు
చితికిన ప్రాణం
పోయిన తనమున
ఓర్చక దుఃఖము
ఆరిన వెలుగులు !

పశుత్వాన్ని అదమదోక్క
కమ్మరి కొలిమిల
ఎగసిన నిప్పులు
కురిసితే వానలు
మాడును మగసిరి
అనుగును మదము
తరుగును తాపము !

కృష్ణ మణి


Wednesday, February 12, 2014

గురుగులాలయం

************
అమ్మానాయిన కష్టం
తిండికే సరిపోక పొతే
నడవని పయ్యల బతుకు బండిల
మా సదువులెట్ల సాగుతయి
అందుకే మావొళ్ళు
సర్కారాస్టల్ల ఎశిన్రు నన్ను !

కడుపునిండ అన్నం
ఎసుకోనికే బట్టలు
పండనీకే దుప్పటి
ఆడుకోనికే అన్నీ
అన్నీ ఉన్నా అమ్మ లేదు !

మా ఇంటికాడ సోపతోంతో జగడమాడితే
తల్లి పెట్టోలె మా అవ్వ ఉరుముతుండె
ఏడిస్తే దెగ్గరికిదీషి అదుముతుండె
ఈడనేమో మూలిగిన గాని ముట్టరాయే !

గిన్నెవట్టి గోలుసుగడితే అన్నముంటది
లేకుంటె అయ్యల్ల కడుపు కాలుతది
అమ్మ ఐతే పూట పూటకు తింటలేనని తిడుతుండె
అన్నకాడికి లేదనక నింపుతుండె !

మా నాయిన వారమైతె
అక్కడిక్కడ ఓయి  పట్టుకొస్తుండే
చెర్ల శాపలేమీ
ఎండ్రికిచ్చలేమీ
శేనుకాఏమీ
తాటిమున్జలేమీ
ఇప్పుడేమో కోడిగుడ్డు కూడ ఉడకదాయే !

గిన్నెకడిగి
బట్టలుతికి
పెయ్యి తోమి
ఉరుకుల పరుగుల ఇస్కోలాయే
మనసుకారి చెప్పు కుందామంటే
తోడబుట్టినోల్లు కారాయే
అమ్మ నాయిన తోడులేరాయే
యాదికొచ్చి నాలుగురోజులకే
పానమింతాయే !


కృష్ణ మణి I      

గోస

****
తోవ్వలోని కలువ పువ్వులే ముడుసుకున్నై
పోయ్యెదెక్కడో తెల్వని దినాలు గడుస్తున్నై
కరిషే చెప్పులు తోడుగ అడుగులు పడుతున్నై
తెప్పల పిడిగులు భయపెడుతున్నై
కొండలు ఆగులు దాటినా దుక్కులే దిక్కైనై
తిప్పల మాటున కడుపులు అరుస్తున్నై
మండే అగ్గిల బతుకులు కాలుతున్నై
దాపులేని కాడ పానాలు తడుస్తున్నై
డొక్కలు దేలిన బొక్కలు ఒంకుతున్నై
దిక్కులు దెల్వని మనసులు మొక్కులైన్నై
కారే నీళ్ళలో మేరుపులే మురిపాలనై

గతి లేని లోకాన మడుగులే గోడుగులైనై
కానరాని వెలుగున సిమ్మసీకటి తోడుకైనది


కృష్ణ మణి I 13-02-2014   

Tuesday, February 11, 2014

మనుషులు

************
అందమైన ఊరిది సుషెతానికి కాదు 
మనషుల గుండెలు చిక్కని బర్రె పాలే !

రానుబోను కశీరుకాడ పానమైన పిలుపులు 
యాడికోతున్నవ్ మామ...గీడిదాక పొయ్యొస్త అల్లుడా !
మల్లయ్య తాతో ...
ఎమోయ్ పిల్లగా అంత మంచిగనేనా ?
ఉన్న తాతిట్ల అని పానమెల్లాగొడతరు !
పిల్ల బాగైనదా సత్తమ్మ షిన్ని 
ఏంజేతు బిడ్డ్యా.... తీరొక్క మందులు పొస్తినని 
మంచి చెడ్డలడుగుతరు !

జోన్నరోట్టెందుకూ లేదనక పంచుకతిందురు !
కయ్యమాడ కాలుదువ్వె కడుపుమంట ఉన్నోనికి గిట 
నలుగురు జెప్పిందే నాయం నలుగురొప్పుకుందే ధర్మం !
కష్టమోచ్చినోడింటి కాడ కాలునోయ్యవుందురు 
పగోనింట్ల పెండ్లైతె పదిత్తులైన ఏద్దురు !

ఎడ్లబండ్లల్ల జాతరొంగ 
రానువోను తోవ్వపోడితి 
బతుకమ్మ పాటలు 
మల్లన్న ఎల్లమ్మ కతలు 
ఇంటా జరుగుడు !

ఆపదుంటె యాదికొచ్చె అక్కజేల్లె పానము 
కార్యముంటే ఆ దినం ఆడివిల్లల మురుసుడు
సల్లగుండు అమ్మగారని ఒడిబియ్యం పోసుకొని దీవెనలు ఇత్తురు !

ఎండిన బతుకైన మాటవడని నెత్తురు 
రోశగాల్లకు రోశగాల్లు మా ఊరి మనుషులు !

కృష్ణ మణి I 03-03-2014