Thursday, April 2, 2015

మనోనేత్రం

మనోనేత్రం
_______________కృష్ణ మణి

మనోనేత్రం ముందు మంచు తెర ఒకటి
విచక్షణను మందగించేలాచేస్తుంది
బ్రతుకు బాటలో నిత్యం
మనిషి రోడ్డుపాలు !

అలా అని చాల జాలి పడాల్సిన అవసరం లేదు
ఇప్పుడు హార్ట్ బీట్ అంటుంది
లెట్స్ చేంజ్ ది లైఫ్ అని !

నడిచే అందాలను రెటీనా మాటున దాగిన
AK 47 తో పెల్చేస్తుంటే
హృదయానికి గుచ్చుకొన్న బుల్లెట్స్ ని రోజూ ఎన్నని తీస్తారు !

వయసు మర్యాదలు
బయటి మొహమాటాలు మాత్రమే
ఇన్నర్ వరల్డ్ చాల చెబుతుంది రోజుకి 24 గంటలు !

కాలేజ్ డేస్ ఒకప్పటి ముచ్చట
ఇప్పుడు స్కూల్ డేస్ మెమరీస్ ఎక్కువ
పదికి ముందే ప్రణయాలు ఈలలు గోలలు
తెరను తాకిన విషం !

యవ్వన లోకానికి
టీవీ ఆన్ చేస్తే చాలు
కావాల్సిన టిఫిన్స్ దొరుకుతాయి !

అపరిపక్వత మనసున
మసాల విందుల వడ్డన
ఆఫీస్ లో కూర్చొని మావాడు ఎలా మారుతాడోనని
ఆలోచనల వరదలో నాన్న
ఇంటిపనుల్లో అలవని ఓపికకు
రోజంతా ఈ వరదలోనే మునక !

అటుగా వెళుతున్న పడుచు అందాలకు అందరు పసి మనసులే
తీరా ఆ డాటర్ మన డాటర్ అయితే
ఎవరికీ చెప్పుకొని అసహ్యపు బాద !

చెడ్డిపై దాటిన బాల్యం
కాలేజ్ వేలుతున్నాడంటే
పక్కింటి కవ్వింపు కన్నుల్లో మెరుపు !

ఇంతకీ ఎవరు మారారో
ఎవరు మారాలో
అర్ధం కాని వింత ప్రశ్నల లాకర్ !

విషం నిండిన అపవిత్రుల ముందు అంతా
మంచు దుప్పటిలో మసక చూపే !

కృష్ణ మణి