Saturday, February 22, 2014

ఆకలి ప్రేమ

ఆకలి ప్రేమ
____________కృష్ణ మణి

మా అమ్మ ఎక్కడుందో ?
నా తల్లి ఎలా వుంటుందో ?
అని తోడబుట్టినోల్ల తోడుగా
ఆకలి కేకలకు అదిరిన గుండె నాది !

అటు ఇటు ఎటు పోదూ ?
నడక తెలియని అమాయకత్వం
అరుపుతో నైన పిలువనా ?
కాని ఏమని ?
నోరు పెకలదే ... ఎట్లా
కళ్ళు తెరిచే శక్తి లేదు
అది రాత్రో పగలో తెలియదు
ఉన్నది మట్టిపైనో లేక రాయిపైనో తెలియదు
ఉన్నది నీడలోనా లేక ఎండలోనా అర్ధం కాదు
తల్లి రాకకై పడిగాపులు

అమ్మ వచ్చింది
అందరిని దగ్గర తీసింది
బిరబిరామని పోటి పరుగున
ఆ పాల ధారను అందుకొని
అలసిన డొక్కల నింపు సమయాన
ముక్కు నాలుకతో మమ్ము తడిమి
చూపుతున్న ప్రేమ జల్లులో తడుస్తూ
ఎరుగని ఆప్యాయతలో ఒదిగినం
మమ్మోదిలి ఎళ్లకే అమ్మా అని
గట్టిగా హత్తుకొని ములిగినం


కృష్ణ మణి

No comments:

Post a Comment