________________కృష్ణ మణి
రంది చేసుడేంది భాయ్ సాబ్
నిజం కనిపిస్తుంది నీ మొఖంల
మురిగిన యాపిల్ పండోలె భాయ్ సాబ్ !
నువ్వు కావాలంటే తిమ్మిని బమ్మి జేస్తవు
నాకాడికి రాగానే లబ లబ మంటవు
నీకు GO లు చుట్టాలు
నాకు మాత్రం ఎక్ష్పైరి GO పాలోనివి భాయ్ సాబ్ !
పురుగుల మందు తాగమంటవు
నీదీ కడుపే గదా నాలెక్క
నీకు రెండుపూటలు గడుస్తున్నప్పుడు
నా ఒక్క పూట తిండి మీద ఏడుపెందుకు భాయ్ సాబ్ ?
నిజమే అనిపిస్తుంది ఆనాడు లాడాయి సరిదని
ఒడువని లాడాయని ఇయ్యాల తెలుస్తుంది
నీ ఓర్వని గుణం ఒరిగిపోను
ఎలుగు లేనికాడ మొమ్బత్తిని కూడా ఊదుతున్నవు భాయ్
సాబ్ !
ఒక డళ్ళు పడంగనే పాణం సల్లవడ్డది
ఆకు పచ్చవడ్డది
పోరుగోడు సల్లగుంటే నేను సల్లగుంట
కాని నువ్వు పోరుగోడు నెగుల్తే పొయిల నీళ్ళు
పోస్తున్నవు భాయ్ సాబ్ !
కృష్ణ మణి I