ఏం
జెయ్యాలె ?
____________________ కృష్ణ
మణి
గడిగడికో
గండం నా మొగుడు
యదల
మంటలు మాన్పె తొవ్వల నేనుంటి !
ఏం
జెయ్యాలె
మాటముచ్చటకు
ముందే
సరసమాడమనే
ఇంట్ల
అన్నలదెలిసి
ఆగమాగమయ్యి
లగ్గమొద్దనె !
బావకిచ్చిన
మాట జవదాటని మా నాయిన
అడుగు
ఎంకవడితే అవమానమైతదని
ఆగలేనికాడ
పెండ్లిజేశిచ్చె
అత్తమామల
మొక్కి ఆ ఇంట్ల కాలుపెడితే
కాటికైయిన
నయమని
ఇయ్యల్ల
తెలిశొచ్చె !
బయటిశోకుల
నా మొగుడు
ఆడినాటలు
ఇని
మన్సుకాలి
బుడిదాఎ
ఆడపిల్లలు
పుడితె ఇద్దరే ముద్దని
ఎంతజెప్పిన
ఇనక
ఆప్రీషను
జేపిచ్చె !
కాలం
గడిశిన కాడ
పాత
గుణము లేశె
బరితెగిమ్పున
బామాటలకు బయలుదేరె
అన్నకు
కొడుకుపుడితె
నాకెందుకు
లేరని
మల్ల
కోపిచ్చే నా పాణం పోయ్యిరాంగ
దవాఖానల
నేవంతె
నా
ఇంట్ల భోగమాటలు !
అవి
తెలిశి అడుగంగ
ఊర్ల
ఎవడు సోక్కం నేను జేస్త
ఎవడు
అడ్డమనె
సవితిని
తెస్త ఒప్పుకో
లేదంటే
తప్పుకో అని
నడిరాతిరి
సీసవలిగే నెత్తిన
కారేది
కన్నీరా లేక నేత్తురాని
తెలియని
రాత్రులు ఎన్నో గడిశె !
కాలయమున్ని
కట్టబెట్టిన అమ్మానాయిన
ఊరంతటిని
ఒకటి జేస్తే
ఎంత
జెప్పిన ఇనక
ఊరకుక్క
తిరిగి మొరగవట్టె
నలుగురిలవెట్టి
నవ్వులాట చేశినానని
పానం
తింటనని కత్తి ఎత్తి రాంగ
పోలిసొళ్ళ
కాడ పంచాదులు చెయ్యంగ
పైసలు
తినే కాడ నాయమేక్కడుంటది ?
ఊరోళ్ళు
నవ్వసాగే
ఇల్వ
లేని జన్మ
మర్ల
బడ్డ మొగుడిని
సావుదెబ్బలు
కొట్టే అన్నలు ఓపని కోపాన
ముందు
రాయెత్తి సంపజూసిందని
అన్నల
కన్న ముందు నన్నే దోషని కోర్టులు తిప్పవట్టే
సావురాని
సన్నాసి !
యాడాది
నర్దం ఆగిజూస్తి
బిడ్డల
బతుకుకోసం నేనెక్కితి కోర్టు
అడుగు
బెట్టని సొట అల్వాటాయే కర్మ కర్మ
పైస
తిన్న మా లాయరు నా మొగుడి సైగలల్ల మసిలే !
యాడాది
గడిశిపాయే
తిండి
తిప్పలెట్ల ?
నా
పిల్లల సదువులెట్ల ?
ఎంతగనమని
మావోల్లు పెడ్తరు ?
మొగునికి
రోగామన్న రాదాయే
శావ
జేస్కుందమంటె !
బరువై
లోకానికి
ఎండమాయి
బతుకున
నా
గుడ్డుల తోవ్వేదీ ?
ఏ
ఏట్ల నేవడుదు ?
ఏం
జెయ్యాలె ? ఏం జెయ్యాలె ..... ?
కృష్ణ
మణి
No comments:
Post a Comment