ఇట్లు ... మీ
శత్రువు
____________________కృష్ణ మణి
అవును
నేను మీ ప్రేయసిని
నా జీవితం
మీపై ఆధారపడి ఉంది
అవును నిజంగా
మనిషిగా మీరు
తెలివైనవారు
మీ చుట్టూ
మీరల్లుకున్న
అందమైన కుటీరాలు
మేడలు మిద్దెలు
ప్రేమలు
ఆప్యాయతలు
మీ రక్షణనే మీకు
ముఖ్యం
అందుకు ప్రకృతిని
అదిమి
పసిపిల్లోడి
చేతిలో బొమ్మలా
ముక్కలు ముక్కలు
చేస్తారు
వీడు చేసాడని
వాడు చేసాడని
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు
ఆశ్చర్యం
మీరు ఆధునిక
యుగానికి నాంది పలికి
ముందుకు
సాగుతుంటే మురిసిపోయాను
మీ చుట్టూ చేరి
మీతో ఆడుకోవాలని
ఆశతో
నిత్యం సంధ్య
సమాయానికై ఎదురుచూస్తాను
మీరు తినే
రకరకాలైన తిండి నాకొద్దు
మీరు తింటే నేను
తిన్నట్టే
రాత్రిళ్ళు కడుపు
నింపుకొని
మీ పక్కన
పడుకోవాలని ఉబలాటం
నా బతుకు చాల
చిన్నది మీతో పోలిస్తే
మీతో గడిపే
కొన్ని రాత్రులు చాలు నా జీవితానికి
మీరు లేక నేను
లేను
అంతా హాయిగా
సాగుతున్న రోజులలో
నాపై ఇంత కక్ష
ఎందుకు
నాపై ఇంత ద్వేషం
ఎందుకు
నన్ను చంపాలనే పగేందుకు
నిజంగా నావల్ల
మీకు నష్టం వస్తే
అందుకు బాధ్యత వహిస్తాను
మీరు పీల్చామన్న
గాలినే పీల్చి
మీ కాళ్ళ ముందే
నెల రాలుతాను
ఇంకా ఆలస్యం
ఎందుకు
నా ప్రేమకు
గుర్తుగా ఏమి ఇవ్వలేను
కాని ఒక్కసారి
ముద్దుపెట్టుకోనివ్వండి
చాలు
ఈ జన్మకు ఇంతే
అనుకుంటాను
ఉంటానూ
ప్రేమతో
మీ దోమ
కృష్ణ మణి