Friday, January 27, 2017

ఒక సజీవ/నిర్జీవ వ్యధ

ఒక సజీవ/నిర్జీవ వ్యధ
_____________________కృష్ణ మణి

ఆరు ఏళ్ల కాపురం
ఇక నాకు పిల్లలు కారని భర్త వదిలించుకున్నాడు
తన లోపాన్ని దాచుకొని

నా ప్రేమే నన్ను మోసం చేసి ఆనాదను చేసింది
మా తల్లిదండ్రుల ముందు
నా చెల్లి తమ్ముడు ముందు

కొన్ని రోజులు గడిచాకా
కొన్ని నిద్రలేని రాత్రులు దాటాక
జీవితం అంటే ఏమిటని
నన్ను నేను ప్రశ్నించుకొని
కొన్ని మెట్లు ఎక్కి
కొన్ని పూజలు చేసి
మళ్ళీ పెల్లికూతురినయ్యాను
మా పెద్దల మందలింపుల తర్వాత

భార్య చనిపోయి
తోడుకై ఎదురుచూస్తున్న పెళ్ళికొడుకుకి పదేళ్ళ కూతురు
కనకముందే కలిసొచ్చిన కూతురిని
కడుపార ప్రేమించాను
కడుపు పండితే సవితి ప్రేమ కానరాదని
నా ఇంట్లో నన్నే పరాయిదాన్ని చేసారు

రెండో పెళ్లి చేసుకుని మూడో భార్యగా అడుగు పెట్టినందుకు
అడుగడుగునా ముళ్ళే
వంటావార్పుకాడ అవమానాలను జీర్ణం చేసుకున్నాను
అర్ధంకాని ఆచారాలను నెత్తిన పెట్టుకున్నాను
పసిగుడ్డును ఒళ్ళో పెట్టుకొని
పాలిచ్చే సమయం లేని పనిమనిషినయ్యాను

మనసువిప్పి బాధను పంచుకుందామంటే
కట్టుకున్నవాడికి నేనొక ఉమ్పుడుగత్తెను మాత్రమే !

శత్రువుల మధ్య శల్యమైన శరీరాన్ని మోయలేని పిరికినయ్యాను
ఆప్తులైన అమ్మానాన్నలకు మొరపెట్టుకుంటే
నీ జీవితం ఇంతే
ఇలాగే సాగని అని
భారమైన బతుకుకు భరోసా ఇవ్వలేని నిస్సాహాయులయ్యారు

పసిబిడ్డకు జ్వరమొస్తే తప్పునాదేనట
జలుబు చేస్తే తప్పునాదేనట
ఏడిస్తే తప్పునాదేనట
     
ఇప్పుడు పాపకు రక్తవిరోచనాలు
ఎవరు పట్టించుకోని దయనీయ స్తితి

పాపకేమన్న అయితే
పీడవిరగడ చేసుకోవోచ్చని అందరి ఎదురుచూపులు
ఇంకా మాటలు రాని పాపే నా సర్వస్వం
తనకేమైనా అయితే నేను బతకలేను
తన నాకు దూరం కాక ముందే
నేను దూరమవుతాను

నాకు ఇంతే గుర్తుంది
నెయిల్ పాలిష్ సీసాలు తాగాను
నిర్జీవంగా పడి
బోరున విలపిస్తున్న నా పాప అరుపులు వింటున్నాను
నా పాప ఎలా ఉంది .......తర్వాత ఏమైంది

కృష్ణ మణి