Monday, February 2, 2015

నగరం


____________________కృష్ణ మణి
అదో సుందర నగరం
ఆకాశంలోని చుక్కలు నెలకు దిగిన వైనం
ఎటు చూడు పచ్చటి ఆకుల నడుమ ఇంద్రధనుస్సు వర్ణాలు
అభిషేకానికి నిండుగా పొదుగుతున్నవి !

అడుగు అడుగున మడుగులలో
తీరొక్క రంగు చేపలు జలకాలాడుతూ 
వెచ్చని తనువును మురిపెంగా సపర్యలు చెయ్య
మిల మిలమను కన్నులతో పలకరిస్తున్నవి !

కోయిలమ్మలు ఇంపగు రాగాలతో
వసంతాలాపన చేస్తు మత్తును జల్లుతూ  
నెమల్లు సరిరారు మాకేవ్వరు అంటు లోకం మెచ్చేలా  
నయనానంద వర్ణాలతో ఉల్లాసంగా నర్తిస్తున్నవి !

జింకలు కుందేళ్ళు తమ అల్లరి గెంతులతో
కనులకు విందుగొలుపుతూ  
రామచిలుకలు సీతాకోకచిలుకలు గుంపులుగా చేరి
ఎటుచూడు ఆహ్లాదం నింపుతున్నవి !

నా మది నగరం నిండుగా తొలికె పాల కడవలా ముస్తాబై
ఏలే మహారాణి ఎవరని ప్రతి క్షణం
కనుల ముందు కలయాడె పాదాలలో వెతుకుతూ
తామరాకు గుణంలాంటి పాదానికై పరితపిస్తుంది !

కృష్ణ మణి  I 31-01-2015




చిత్తం


_____________కృష్ణ మణి

మహారాజా.......!
ఇంకో ముప్పై ముదురెద్దామా
లేక అశ్వమేధయాగం చేద్దామా రాజా !

ఒకటికి నాలుగోవంతు ఎందుకూ
ఆరోవంతు ఇవ్వడమే ఎక్కువ
పెట్టినదానికి నొక్కేది సరిపోక పొతే  
మరి వచ్చే యుద్ధానికి సమాయత్తం ఎట్లా !

వాకిట్లో ఎదురుచూపు
కట్నం చదివించుకోవడానికి
జై కొడతారనుకున్న బడుగులు
జీవాలను ఏం చెయ్యాలని అడిగారు
జూ కి పంపించన నా కాజ !

తిండి పెట్టె పల్లెను పట్నం చెయ్యడం బాగానే ఉన్నా
పట్నానికి తిండెట్లని ఆలోచన ఒకవైపు
ఆకాశానికి మెట్లు బాగానే ఉన్నా  
బురదలో అడుగు జారితే ఎట్లని మరోవైపు !

అరచేతిలో స్వర్గం బాగు బాగు
ఒకన్ని చూసి ఓర్వని గుణం ఎంత ఉంటె
అంత ఎడువడమూ నిజము నిజము  !
సూర్యున్ని మింగే రాహు కేతులకు
కొద్ది కాలమే బలము బలము
జనసంద్రానికి మెలుకువ వస్తే
క్షణ కాలంలో నోక్కేదీ ఖాయం ఖాయం  !


కృష్ణ మణి I 02-02-2015