Saturday, November 30, 2013

లాలి పాట


రావోయి రా గానగంధర్వుడా రా  !
నీ పాటతో నా పాపకు ఆనంద విందుగానివ్వు
ఆ ఏడుపు ఆపు నీకు వెయ్యినూట పదహార్లు !

పాడమంటే ఎ పాటను పాడగలను
ఎంత పాడిన, రాగం ఎంత తీసిన
తల్లి లాలి పాటే పాపకు రాగామ్రుతం కాదా !
రాగం తెలియని తల్లికి పసి పిల్లల కేరింతల
మువ్వల సవ్వడే బహుమానం కాదా !

నారయనుడైన  నరకాసురుడైన
లాలిపాటలో లీనమైన వారే కాదా !
అమ్మ వొడిలో సేద తీరిన వారే కాదా !
ఎన్ని పాటలు పాడిన చివరకు
జోల పాటే  కాదా ఎంకన్నకు  విశ్రాంతి !

Friday, November 29, 2013

సంబురాల జాతరా









సంబురాల జాతరా
తెలంగాణా గుండెల్లో సంబురాల జాతర..! ఏడ సూడు ఎగురుతుంది ఉద్యమాల జండ రా ...!
చిన్న పెద్దలంత కూడి అందుకున్న పాట రా ! ఆనందం తట్టలేక ఆడుతున్న ప్పు రా..!

అమ్మయ్య కనులల్లో సంతోషం సాగేరా...!
 ముసలోళ్ళ మనసులల్ల నెరవేరిన చింత రా ...!
చిన్నారి పసి పాపల చిరు నవ్వులే ఆస్తిరా ..!
 ఆ కష్టం మరిచాము ఇక ఎ నష్టం లేదురా..!

ఆంధ్ర గద్ద పోడుసుల్లు ఇ మనకు లేవురా..!
పోలిసూ బూట్ల దేబ్బలింక మనకు  ఏలరా..!
బుద్ధిబలం నీదిరా , భుజబలమూ నీదిరా !
 ఆకసమే నీ హద్దు అందుకోర ఆ ఎత్తు..!

చీకట్లో కష్టాలు ఇక లేవని ఆశరా..!
మనకున్న తిప్పలింక చెల్లవురా సోదరా...!
రాబోయే చిన్నోల్లకు దారివేయ్యబూనురా...!
లేకుంటే తప్పదురా శున్యమే అన్డరా...!

--- Krishna Mani

Thursday, November 28, 2013

నా లోని అలలు


చేను కాడ సంపెంగ పూల అల
కొమ్మ పైన పక్షి పిల్లల గోల గట్టు కింద కర్కాటాల వల మేఘాల ఓంపులో దాగిన జల ఎండిన కళ్ళలో ఒదిగిన కల

****************************
చిటపాట చినుకులు! మిడతల అరుపులు ! మిణుగురు మెరుగులు ! జల జల మోతలు !సవ్వడి గాలులు ! కప్పల గంతులు !పాముల సందడి ! ఉరుముల కాంతిలో మెరిసిన జాతర ! మదిలో ఊగెను మత్తున తీగలు !

***************************************
చిగురుటాకుల పైన చినికులు ! చిన్నారుల కళ్ళలో తళుకులు ! చిన్నదాని యదలో వణుకులు ! చింతలో ఉన్నరైతు చిందులు !
--కృష్ణ మణి


నా పల్లె గోడు

నా పల్లె గోడు
_______________ కృష్ణ మణి

చమట చుక్కల వర్షంలో
తడిసిన కాంక్రీటు అడవి
చుక్క చుక్కకో గుండె కోతల గాధ

భూమి బీటల నడుమ
నీటి చుక్కల వేట
దొరకని వేల
ఆరని ఆశల పోరాటం
ఆరిన డొక్కల ఆరాటం

బిడ్డె పెండ్లి కోసం
కొడుకు రోగం కోసం
చేను మందు కోసం
పెండ్లం పుస్తలమ్మి
అవి సాలక
ఇవి సాలక
గొడ్డు గొదమమ్మి
బతుకు నడవక
బయలు దేరిన బాటసారులు

దారేక్కడ పోతుందోనని
అడుగుల కదలిక
తెలియక తికమక
గుండెలో బికబిక

ఈ రోజు గడిచేనా
ఈ పరుగు ఆగేనా
ఎప్పుడో ఎట్లనో
ఈ జీవుల కష్టం ఒడ్డు చేరేది

కృష్ణ మణి