Tuesday, February 11, 2014

మనుషులు

************
అందమైన ఊరిది సుషెతానికి కాదు 
మనషుల గుండెలు చిక్కని బర్రె పాలే !

రానుబోను కశీరుకాడ పానమైన పిలుపులు 
యాడికోతున్నవ్ మామ...గీడిదాక పొయ్యొస్త అల్లుడా !
మల్లయ్య తాతో ...
ఎమోయ్ పిల్లగా అంత మంచిగనేనా ?
ఉన్న తాతిట్ల అని పానమెల్లాగొడతరు !
పిల్ల బాగైనదా సత్తమ్మ షిన్ని 
ఏంజేతు బిడ్డ్యా.... తీరొక్క మందులు పొస్తినని 
మంచి చెడ్డలడుగుతరు !

జోన్నరోట్టెందుకూ లేదనక పంచుకతిందురు !
కయ్యమాడ కాలుదువ్వె కడుపుమంట ఉన్నోనికి గిట 
నలుగురు జెప్పిందే నాయం నలుగురొప్పుకుందే ధర్మం !
కష్టమోచ్చినోడింటి కాడ కాలునోయ్యవుందురు 
పగోనింట్ల పెండ్లైతె పదిత్తులైన ఏద్దురు !

ఎడ్లబండ్లల్ల జాతరొంగ 
రానువోను తోవ్వపోడితి 
బతుకమ్మ పాటలు 
మల్లన్న ఎల్లమ్మ కతలు 
ఇంటా జరుగుడు !

ఆపదుంటె యాదికొచ్చె అక్కజేల్లె పానము 
కార్యముంటే ఆ దినం ఆడివిల్లల మురుసుడు
సల్లగుండు అమ్మగారని ఒడిబియ్యం పోసుకొని దీవెనలు ఇత్తురు !

ఎండిన బతుకైన మాటవడని నెత్తురు 
రోశగాల్లకు రోశగాల్లు మా ఊరి మనుషులు !

కృష్ణ మణి I 03-03-2014

No comments:

Post a Comment