కుచేలుడు
_____________ కృష్ణ మణి
నా
మిత్రుడు కుచేలుడులా
అవసరం ఉండి వస్తాడు
ఎలా అడగాలో తెలియక
అటు ఇటు చూస్తూ
తడబడుతాడు
అర్ధం చేసుకోలేని వాడిని
ఒక నిమిషం ఉండురా మాట్లాడుదామని
డబ్బివ్వాల్సిన వానికి ఫోన్ చేసి అరిస్తే
అదేదో వీడినే అన్నట్లు అవమాన పడతాడు
పలానా వాడు తెగ ఇబ్బంది పెడుతున్నాడురా
అని బాధను చెప్పుకున్నాను
నేనడిగి ఇచ్చేటట్లు చేస్తానురా బెంగపడకని
ధైర్యం చెప్పి వెళ్ళాడు
డబ్బిచ్చేవాడు తిరిగిస్తూ
ఆ అన్నకు ఎందుకు చెప్పవన్నా
నీ డబ్బును ముంచుతానా అన్నాడు
స్నేహానికి విలువిచ్చి
మన కష్టాలను తనవిగా భావించే వాడే
నిజమైన మిత్రుడు
నా
మిత్రుడు
కాని వాడు
నేను కృష్ణున్ని కాలేననే బాధను మిగిల్చాలనుకున్నాడు
అమాయకంగా
కృష్ణ మణి