Friday, February 7, 2014

అంగడి


అంగడి
_______________కృష్ణ మణి

ఆదివారం నాడు
దుమ్ము ఆకసమంటే
మాఊరి అంగడిల !

నాలుగూర్ల కష్టజీవులు
ఒక్కటైన దినాన
ఎడ్లబండ్లు దింపి
కుప్పలన్ని పేర్శి
నడితోవ్వల కూసుందురు
పొద్దెక్కనియ్యని కాయదొరలు !

జనం నిండెను సూడు
బ్యారమాడే సోట !

''అన్నా '' అని పడతి
ఇంతకిమ్మని మారం
రాదు శెల్లే అని
గుండె ఒంపిన ప్రేమ
పొగరు మాటా రాని చెమట చిందిన దాత !

సుట్టమేమో కలిశే
పానమైన పలుకు
కష్టసుఖమూ మాట
అల్కగైనా బరువు !
తిండి తిప్పలు మాని
మూటలన్నీ పోంగ
మిగిల్నయాటిని చూసి
కంట్ల నీరే నిండె !

పొద్దు ఒయే యాల
తిరుగు బండ్లను కట్టి
పానమలసిన జీవి
కడుపుకింత కళ్ళు తాపి
ఇంటి తొవ్వ వట్టె
పెండ్లాంపిల్లలు ఎదురుసూడ !


కృష్ణ మణి I 08-02 -2014

No comments:

Post a Comment