Tuesday, February 11, 2014

బొండు మల్లె చెట్టు

************
మా ఊరు ఒకనాడు
పట్నం కాక మునుపు
బశిస్టాండ్ల ఉండేది
బొండు మల్లె చెట్టు !
ఒచ్చి పోఎకాడ
మనసార పలకరించి
పూ అచ్చింతలు జల్లేది !
తలెత్తి చూస్తె పూలగుత్తులు
చిక్క చిక్కగా పచ్చని గుంపున
తెల్లని మొగ్గలు
ఇప్పుకొని నవ్వేటివి !
ఇంతవుండి మేమంతా
కొమ్మ ఒంపి తెంపగోరి
ఎక్కవోతే చిన్నగుండునా  ఆ చెట్టు !
రాలే పూలను ఏరి
ఆడుతుండే  మత్తున !
కాడకు కాడను మలచి
అల్లితే అయితుండె
దారంలేని దేవుని దండ !
కాడను ఒత్తి పీ పీ అని పీపలూదేది
తీపి గుంచి చేదు పీల్చి
రెండుగలిపి మింగితిమి
అప్పుడే నేర్పింది
బతుకు పాఠం !
గురుతుకొచ్చి కాలవట్టే
మనసునింత

సూద్దమంటె కానరాదు కళ్ళనిండా !

No comments:

Post a Comment