***********
కనపడని నీడ నా చుట్టూ
నిస్సందేహం !
తల్లి గర్భాన మొలచిన చోటనే
అది నా తోడు
పగలు రాత్రి తేడ లేదు
తొలిసారి అమ్మా అన్నప్పుడూ
తొలిసారి ఒక్కన్నే బయటికొచ్చినప్పుడూ
నా నీడకు ఒక నీడ జతైనప్పుడూ
ప్రతి కర్మను ప్రశ్నిస్తూ
మంచిని తడుతూ
చెడుని తోడుతూ
తడబడు అడుగుల చూస్తూ
గమ్యానికి పాదులు వేస్తూ
అన్నీ వేళల వెంట నడుచును !
కనిపించే నీడే నా ఆత్మ అయితే
కనిపించని నీడ పరమాత్మ !
కృష్ణ మణి I 27-02-2014
No comments:
Post a Comment