Monday, March 24, 2014

కవితా దినోత్సవ కవిత


***********
మమతలకు నెలవాలం
ఊహలకు కొలమానం
వేదనలకు ఉపమానం
ఉద్వేగాలకు జననాదం
ఇవే కదా కవికి కావలిసిన అక్షరయాగ హవిస్సులు
ప్రతి కవి ఒక అగ్నిగుండమై చేయు యజ్ఞంలో ఉద్భావించు
ఎన్నో కవితాపుష్పాలు సేద తీర్చే చల్లని పరిమళ జల్లులు !

మిత్రులకు అంతార్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు

కృష్ణ మణి I 21-03-2014    

అక్షర సమిధ


***********
అక్షర సమిధను
నే ఓటమి ఎరుగని ఆయుధాన్ని
ఆకాశానికి భూమి పైన మెరిసే చుక్కను
నిరంతరం జన ఘోషకు ప్రతిద్వనిని
జన జాతరలో ఉద్యమ పాటను !

పగిలిన గుండెల రూపుకు ప్రతిరూపాన్ని
కమ్మరి కొలిమిలో బొగ్గుల క్రింది గాలి తిత్తిని
రాజ్యహింసను అనుచుటకు లేచిన ఉగ్రకెరటాన్ని
జనుల కన్నీళ్ళ తుడువ మెత్తటి గుడ్డను
చీకటి నడకల తెల్లటి చొక్కాలపై సిరా మరకను !

బలసిన దున్నల ఎటకారపు ఓరకంట చూపుకు
వేటగాడి చేతిలో బాణాన్ని
శూలంల గుచ్చుకుంటా !

నున్ను ఆర్పే సాహాసం చేసే రాజకీయ కీచకుల్లారా
మీ ఊపిరితిత్తుల స్పంజులు పగులుతాయి జాగ్రత్తా !
మీ భోగం క్షణికం
నా వెలుగు
నిత్యం
సత్యం
అనంతం
నిరంతరం
మీ  అంతం తప్పదు !

నా వెలుగు తాకని చీకేటి ఎక్కడా ?
లోకం చూపును ఆపే బలమేక్కడ ?
నేనొక అక్షర సమిధను !


కృష్ణ మణి I 24-03-2014   

Monday, March 17, 2014

భూ’తాలు’


**********
నాలోని ప్రతి కణం పంచభూతాల సంగమం
అమ్మ ఈ ప్రసాదాలతో కూర్చింది కడుపున
అందుకే అందురేమో  పంచభూతాల సాక్షి !  

ధరణి పై కాలు మోపి
ఉచ్వాస నిశ్వాసలతో ఆటలాడి   
నింగికి చేతులెత్తి తారలతో పాటపాడి
వర్షంతో సరసమాడి  
తుదకు మంటల్లో పెనుగులాడి  
ఇందులో పుట్టి ఇందులో పెరిగి ఇందులోనే లయం
ఇదే కదా ధర్మం !

బహుశా !
ఆ ధర్మాన్ని అతిక్రమణ జరిగిందేమో
ఇంతింత రా నాయన అంటే ఇల్లంత వచ్చిండని
ప్రకృతి ఒడిలో రాగానే మనిషి
పంచాభూతాలపై పెత్తనం మొదలుపెట్టాడు !

వనాలను నరికి కొండల్ని వంచి
అణు అగ్గితో ఆటలాడుతూ
పైత్యమేక్కి ప్లాస్టిక్ను పరిచి
గొట్టాల్లో కంపుని నింగిలో జల్లి
ఓజోన్ను తెంపి కాంతి మలినాన్ని దింపి
పాపం ఎరుగని జీవుల బతుకు చెరిపి
మంచుకొండలను మాడగొట్టి
మురికిని నీటిలో కలిపి
వాగుల వంకల ఆరబెట్టి
కల్మషంతో కడలిలో స్మశానం సృష్టించి 
ధరణిని దగ్ధం చేస్తున్నాడు !

తల్లిని దిక్కరించి ఒంటినిండా గాయాలు చేస్తే
ఉండునా ఓర్పుతో ఎంతనీ ?
రుద్రతాండవం చేస్తుంది చూడు !

బడబాగ్ని రాలంగ కాలం కాలిన కట్టెలే  
గాలి కౌగిలిలో సమస్తం తెగిన పటాలే
జడసిన భూమి పగులును పక్కున
ఉప్పొంగును అగ్ని స్రావం
బిక్కు బిక్కుమనే దిక్కుతోయని జీవజాలం
కడలి కెరటాల పొంగులో కడతేరే భయ కన్నులెన్నో !
గొడుగు లేని లోకం గగన శకలాల వర్షంలో !

‘’అహంకారమే అంతానికి ఆది బిందువు ‘’
తెలివి నా సొత్తని విర్రవీగే మానవ కాకులు  
పంచభూతాలకు పట్టిన భూతాలు
లోకాన్నేలే రాజులమని పులిపై స్వారి చేస్తే
ఎందుకు పట్టదు అధోగతి  ?
ఎందుకు కూలదు జీవజాతి ?

కృష్ణ మణి I 19-03-2014




చెత్త బతుకు

చెత్త బతుకు
____________________ Krishna Mani

చేతిలో మొల గుచ్చిన కట్టే
సంకకు సంచి తెగిన చెప్పులు

తెల్లారింది మాకు
చెత్తను ఏరి
మా బతుకులను నింపడానికి

పెంటకుప్పలే భోజనశాల
ఆకలికి అక్కడే ఓదార్పు
పాచిన వంటలు
మురిగిన పళ్ళు
కుక్కల పందుల పోటి పరుగు !

ఇనుము ప్లాస్టీకు కాగితాలు
ఇవే కదా ఆధారం
ఇదే మా జీవితం

విసిరిన వస్తువు
కంటికి మురిపెం
మంచివి చెడ్డవి అన్నీ మావే
బరువు పెంచుతూ
ఆశలు అల్లుతూ
రేపటి రోజుకు చెదరని చూపు !

తరగని చెత్త
నోయ్యని కాలు
పగలు దాటితే
సాగని నడకలు
చేరని తీరం
దించిన మూటలు
అమ్మిన కష్టం
అందిన సొమ్ముతో
అందని వెలుగు

బతుకు పోరులో నిత్యం వేటగాల్లం
చావని ఆశతో మసలే ముల్లుజల్లెలం !

కృష్ణ మణి I

లోకం


********

తెలిసిన లోకముకన్నా ,
తెలియని విషయాలెన్నో ?

గడచిన కాలముకన్నా ,
గడవని రోజులెన్నో ?

కలిగిన సుఖముకన్నా ,
కలచిన దుఃఖాలెన్నో ?

మానిన పుండుకన్నా ,
మాయని గాయాలెన్నో ?

గెలిచిన ఓటమికన్నా ,
ఓడిన విజయాలెన్నో ?

కరిగిన మనసుకన్నా ,
కాలిన గుండెలెన్నో ?

చెదిరిన బతుకుకన్నా ,
చెరచిన మానాలెన్నో ?

జరిగిన ఘోరంకన్నా ,
జరగని న్యాయాలెన్నో ?

నిండిన కడుపుకన్నా ,
నిండని కేకలెన్నో ?

తడసిన నేలకన్నా ,
మునిగిన భూములెన్నో ?


కృష్ణ మణి I 09-03-2014  

ఏది మంచి ?

ఏది మంచి ?
**********

కలలు కల్లలైన నాడు
మనిషిగా బ్రతకడం కష్టం
మనసు రక్కసుగా మారి
కార్చిచ్చులాగా మనుగడను దహియిస్తుంది
అందులో మండే గుండెలెన్నో !
కనికరం లేని కసాయి కడతేర్చిన ప్రాణాలెన్నో?

కాల గమనంలో మనిషి మంచివాడు
అందుకేనేమో మనిషి చెడ్డవాడు !
మంచి ఉన్నచోటే  చెడు ఉండాలి
లేకుంటె రెండూ ఒక్కటేగా !

మానవ చరిత్రలో చెడుపై మంచి గెలుపు
అది కేవలం పుస్తకాలలో కొన్ని పేజీలు మాత్రమే !
చేడు గెలవందే రాజ్యాలు కూలాయా ?
చేడు గెలవందే తలలు తెగాయా ?

మంచి చెడులకి తేడాలేదు
అది కేవలం మనిషి స్వార్ధం మీదే ఆధారం 
అది కేవలం మనిషి ఈర్ష మీదే ఆధారం !

ఇది మంచి అని ఏదీ నిర్వచనం ?
ఇది చెడు అని ఎక్కడ శాసనం ?
రెంటికీ సమాధానం ఉంటే
చెడు లేని మనసులేన్ని ఈ మానవ కూపంలో ?

చెడు చెంతకు ఆరాటం దేనికి ?
మనిషికేమి రోగం ఒక వైపే ఉండొచ్చుగా ?

దేవతలు రాక్షసులు
ఎవరు మంచి వారు ?
ఒకరికి హాని చెయ్యనివారు మంచివారు, దేవతలు
చెడ్డవారు రాక్షసులు అంటారు
మరి మానవులు ఎలాంటి వారు ?
చెడ్డవాళ్ళు ముమ్మాటికి చెడ్డవాళ్ళు  

పువ్వుపై కనిపించే తేనెటీగను చూసి మురిసిపోతాం
తేనెటీగ పోగేసిన తేనెను తస్కరిస్తాం ....మనం రాక్షసులం

కాయలు పండ్లను మురిపాన కని పెంచిన ఎన్నో తల్లులను
పిల్లను ఎడబాపే మనం రాక్షసులం ... నిజంగా రక్కసులం

దూడల మూతులగట్టి కడుపులగొట్టి ఆవుల కన్నీరును ఒమ్పుతాం
దూడల తిత్తుల ఆశపెట్టి బర్రెల గోసల ముడుపుగడతాం....మనం అసురులం

పక్షులను జంతువులను బందీలను జేసి 
బానిస బ్రతుకుకు భద్రత లేదని చిందులేస్తాం ...మనది సిగ్గులేని జన్మ ... మనం రాక్షసులం


కృష్ణ మణి I 15-03-2014 

అలసిన చూపులు

అలసిన చూపులు
***************
నూనె స్తంభ దీపాల వెలుగుల జాతరలో మురిసిన జీవులు
కరెంటు తీగల జిలుగుల తోడుగ
యంత్రాల ఉప్పెనలో తడిసి
నవ నాగరిక నిర్మాణానికి పాదులు నింపి
అలసిన బొక్కల ఒంగిన నడుములు !

మొఖాన కనిపించే రాతలెన్నో ?
జరిగిన కథలకు సాక్షలెన్నో?
ఆ మడతల అడుగున దాగిన ముత్యాలెన్నో?

చేతి కర్రతో చెలిమిని చేస్తూ
కనపడని వినబడని లోకంతో
పలకరింపుకై వింత దిక్కులు 
చెక్కిలి తడిమిన ప్రేమలు
చూపు కానక రాలిన చినుకులు

పొరల కోతకు నిలబడు ఆశా చీమలెన్నో?
కదలని తనవున చూపుకై అరాటమాడు పెగులెన్నో?

మరిగిన రక్తం చల్లారిన దినమున
బిడ్డల ప్రేమను పొందని గడపల
కాసాయి కడుపున కన్నానేందుకని
ఒంటరి అరణ్య రోదనలెన్నో ఎన్నో ...ఎన్నో !

ప్రేమకు అనాధలై అరాటపడు అభాగ్యుల
నోరుమెదపని ముసలితనపు కన్నీరులెన్నో...  ఎన్నో....ఎన్నో !

కొంగుచాటు కొడుకుల చూపుకు కానని
యదలో మండు అగ్నిగోళాలెన్నో ...ఎన్నో ...ఎన్నో !

కడుపుకు గంజిలేక విల విలలాడి
తేలిన బొక్కల అలసిన గుండెలెన్నో ... ఎన్నో ... ఎన్నో !


కృష్ణ మణి I 11-03-2014 

ఆరాటం

ఆరాటం
*********

చెదరని నవ్వుల చెరువు గట్టు
నీ అడుగులని గుర్తు చేసి మూలుగుతుంది
నీ చూపు తగలక అడవి అద్దం నిదుర పోయింది  
నీ స్పర్శ కోసం ఆ గడ్డి మొదలు ఎదురుచూస్తుంది !

నీ ఒడిలో ఆడ
అలసిన డొక్కల లేడి మందల గెంతులు
ఎటు చూడు అల్లల్లాడుతున్నదప్పిక గొంతులు
నీ మెరుపు మెరవక
ఏటి ఒడ్డున పక్షి గుంపుల ఆకలి తిప్పలు   
రాత్రి పగలు తేడా తెలియక
కన్ను ఆర్పని ఎండిన చేపలు
నీ వయ్యారలను చూపిస్తూ
ఆ వాగులు గీసిన బొమ్మలెన్నో !

అగ్గిగుండంలో మోడువారిన మొద్దుల మూగనాదాలు  !
అందం చెదిరి కొండల కోనల గుంతకనుల దిక్కులు !
అధరం పగిలి కారని నెత్తుటి మాడిన దుక్కులు !

కృష్ణ మణి I 13-03-2014





బసంతి

హోలీ శుభాకాంక్షలు
బసంతి
********
మోదుగ పూల నవ్వుల వనం  
ఆ సుందర వర్ణంతో మురిసిన జనం  
ప్రకృతి అంతా మోడు వారి
వసంతాలాపన చేస్తూ చిగురు తొడిగే
సమయాన్ని గుర్తు చేయగా
ఈ పూలు ముందుగానే
వసంతానికి ఆహ్వానం పలుకుతున్నాయి
ఆనందంలో ముంచును లోకాన్ని
అందుకే వాటిని బసంతి పూలని
వసంతానికి చిహ్నంగా పొగడుతాము  !

ధరణి మురిసేను నేడు
మోడువారిన అడవి మెరిసేను చూడు
బసంతి పూల ఆభరణాల ధగ ధగలో !
హోలీ రంగుల్లో తడసిన గుండెలు
ఆప్యాయతల అల్లరిలో పొంగిన మనసులు !

కృష్ణ మణి I 17-03-2014


Thursday, March 6, 2014

"save and Share"


Master-scene script
Version: First Draft
Author:E Krishna


– On Road - MIDDAY
Ankit going out of station on his bike,he playing music and showing masti expression.
Suddenly the music stopped, he stops the bike and checks the music player.at that time he feels thirsty and opens the purchased water bottle and drink half of bottle and thrown on the road remaining water, when water is coming out of bottle. A hungry looks girl/boy with dirty cloths run for pick the water to drink ,the bottle became empty she/he looks sadly at pored water on land.he going on his bike. The music continues.

- OFFICE - MORNING
Office boy filled the water bottles in the morning at the pantry, and went to each employee’s desk to place the bottles. He stopped by each of the employee’s desk to wish Good Morning!!!
As he came by Ankit’s desk, with a imitational look he placed the bottle, and looked at the bottle considerately and touched it like a baby. This was observed by Ankit and he looked at the boy angrily as if he understood his mind. Then the boy realizing that Ankit noticed him, said 'Good morning Sir", to which  he replied too with a anger tone "good morning".
- OFFICE - MORNING
Ankit goes to his other colleagues (girls) one by one and starts irritating them by talking to them about the out of office topics and enquiring them about their personal life. He goes to shwetha and talks rubbish. He takes her water bottle opens it drinks from it. She looks at him seriously, expressing her anger at ankit. While he was drinking water he gets a call from his boss,and in a hurry he moves from there placing the bottle carelessly and without placing the bottle lid.
Dialogues:
Ankit: Hi Shwetha,how are YOU?
Shwetha: hi, Iam OK ,WHAt About YOU.
Ankit: Fine, I Heard You engaged.
Seriously looking at Anikt
Shweta: yes, don’t Bother I will invite on my Marriage.
Ankit  picked her water bottle opened while he drinking water he goes to another girl.
Sushanth: Ankit Let us go and have smoke.
Ankit: ok I will join  in 2 minutes.
Ankit:Hi Purnima, what about your boy friend.
Purnima:hmm great, I heard your new girl jumped out of your box just like old girl friend.
Ankit: No No who said?
Rakesh: Even Office boy knows About It.
Ankit: shut up fat boy.
Office boy looks at ankit and says with laugh
Office boy: Ankit  Sir, Imran Sir calling You.He is at his Cabin”.
- OFFICE - MIDDAY
Ankit is asked for an explanation by his boss on his performance and the boss starts scolding him. After this he’s comes out with grave look, he takes the water bottle from Office Boy, and goes out of office and uses the drinking water to clean his face and calm down his anger. While he cleanses his face he abuses his boss continously.
This time two colleagues are abserved him and
Ask him” hey Ankit, Do you Know the value of water” he Replies”Boss Does not know the value of mine”
Colleagues with laughing heads says” yes’, with slow voice” boss is right”.
- OFFICE - MORNING
Ankit goes to washroom and after washing hands he gets a Phone call, and while attending to it he goes out without turning off the tap. Noticing the water running waste, by his other employee, closes the tap.
- OUT OF OFFICE NEAR LAKE UNDER THE TREE -MIDDAY
all colleagues are chit chatting and joking and laughing that time. ankit come out of office and having cigarette, first he looks at caution massage on cigarette pack and smiles and turning head towards collogues saying "hi" he walks
Ankit ask about week end party plans about other colleagues and he says about his plan that was cancelled. he ready to join with colleagues. they looks at him strangely and says about there plan that is mount trucking. Ankit laughs at them and saying that reducing the callories.than all looks at him seriously than he controlls his laugh and request them to adding him in there team. they agree.
 - MOUNT - MIDDAY
all are get ready for mount trucking . bikes and 4 wheeter movements to reach the mount.
 all are running , walking , jumping, climbing big rocks and making fun with each other on the hills .
Running compitations. All gymnostic skits.
- ON THE MOUNT - EVENING
these all about sweating out . we play back ground music, end of the music all are breathing heavily and drinking water. drinking one by one . Ankit tired up more than all and looking at each one , who drinking water. finally the water bottles all empty. but Ankit can not get water. he serious and with impatient he requesting to all. and all are saying sorry at him. Finally, he turns at small water pond with mud water. to servive he ready to jump in that pond to have water.
when he trying to touch water with his mouth, all collogues pulled back him. than He says with serious with impatient look " you all
want me to die, can not i take this mud water also Ediots" slowly
one of colleagues give a half bottle water, Ankit take that water rushly and sit on rock. he drinks water,
when he is drinking he recollect those mistakes on with water.
Slowly opens his eyes with realised feeling
He looks at his colleagues with shy and smiles.
Every one says loudly “SAVE WATER”

Ankit says “ Share this Videos”

మా అవ్వ


**********

మా అవ్వ !
కాళ్ళకు కడియాలు 
నడుముకు ఎండి పట్టి 
చేతులు మెరిశే గోట్లతోడ గాజులు 
మోజేతికి కడియమేషి 
మేడల గుండ్లారం 
ముక్కుపుల్ల 
చెవుల గెంటీలు 
ముతకశీరల 
నోసలుకు పెద్ద బొట్టుతో 
సున్నీకే తమాషగుంది !

మా అమ్మానాయిన అదృష్టం 
చూశిన్రు కండ్లనిండ ఆ అందం 
మాకయితే పాత పోటవల జూసి మురుసుడాయే !

కృష్ణ మణి I 05-03-2014