Monday, January 27, 2014

రాజ్యమా !

********
చిలవలు పలువలుగా విలువలవలువలను
ఇప్పిపారెశె దుశ్యాసన పాపనాసుల
కాళ్ళకింద పడి విలవిలలాడుతున్న ఓ రాజ్యమా !

నీ సంతానం చాతగాని గాంభీర్యం !

ఏలనీకే నాలుగు పాదాలు
చెదలు పట్టించిన ఘనులు
చేసేయన్నిచట్టాలు
దోయనీకే చుట్టాలు
బక్కోనికి బొక్కలు

రక్షకులే ఊరేనక పెద్దబోజలు
బలిసినోడి గేటు కాడ ఊరకుక్కలు
లేనోడి భుమికాడ గుంత నక్కలు
అడిగేటోడి నెత్తిమీద గన్ను ఎక్కులు

పాతకారు ఓయి కొత్తకారు ఒచ్చె
ఉన్నసైకిలు ఓయి చేత్ల చెప్పులు వట్టే
బయటికేమో అందరొక్కటే
లోపలేమో దొంగజేబులు
సావనోని పిండానికి ఎదురుసూపులు
చెప్పనీకే పాత గొప్పలు
పక్కోనికి  నవ్వులాటలు

ఉన్మాదపు కొడుకుల తొక్కలేక
సంపలేక సావలేక
నలుగుతున్నవు చెప్పలేక
తూట్లు వడ్డ మెరుపు వలువలొ
లోకం సూడా గొప్పగున్నవె !

కృష్ణ మణి I 27-01-2014

Friday, January 24, 2014

ప్రేమ జల్లు


నా ఊహల అరణ్యంలో
పచ్చటి చెట్ల మద్యన అందమైన పూదోట
తోట నడుమ మడుగులో రంగు రంగుల చేపలు
మడుగు అంచున పాల రాతి ఆసనం
దానిపై  నా హృదయ రాణి
కాళ్ళు చాపుకొని తన ఒడిలో తల ఉంచి
అనురాగపు పిల్లనగోవి సమ్మోహన నాదం
వింటూ ఆ మధుర క్షణాలను
ఒక్కొక్కటిని ఆస్వాదిస్తున్నాను
నల్లని కురులని జరిపి
మెరిసే ఎర్రటి పెదాల సుందర బింబాన్ని
రెప్ప పాటు రాకుండ చూస్తూ
తేనే కనుల చూపుల మత్తులో
ఊగుతున్న నా మనసు

స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు
కాని శాశ్వతంగా
ఈ ప్రేమ జల్లులో తడవాలని ఉంది !

కృష్ణ మణి 

Thursday, January 23, 2014

పెండ్లి


ఒడదింపి అల్లిన
కొబ్బరాకుల గుంజలు
పూల గుత్తులతొ పచ్చని పందిరి
మేడి కొమ్మని గుంజకు గట్టగ
ఎలిగిన దీపం

నెత్తికి భాశింగం
పుసుపు రాశిన మొఖము
చెంపకు చుక్క
చేతిలో అడ్డకత్తెర
మేడలో దండలు
పట్టులో ఒదిగిన గువ్వలు
మెరిశిన కన్నులు

పడతుల ఒంటి నిండా సింగారించిన దగలు
పంతులయ్య పద్యాలు
తాళి కట్టే యాల పిల్లగాని నవ్వులు
తల ఒంచిన పిల్ల
మేడలో మెరిశిన జీవితం
పెద్దల దీవెనలు
అమ్మనాయిన కన్నుల పండుగ

మొదుగాకుల ఇస్తర్లు
ఎర్రగ పరిశిన చద్దర్లు
బగార అన్నం బఠానీ గింజలు
పాలకూర పప్పు సారొంకాయ
సాంబారు శారు అంచుకు మిక్చరు
మైసూర్ పాకు

మస్తుగ జరిగింది పెండ్లి
ఎడూర్ల జనం ఒస్తోల్లు రావట్టే
పోయేటొళ్ళు పోవట్టే

కృష్ణ మణి I 24-01-2014

సందె పొద్దు


సూరిడలసి పొద్దు దాటు వేల
ఆకలితో అమ్మ రాకకై ఎదురుచూస్తూ
పక్షి కూనలు చేయు గోల
బతుకు నేర్పు నేర్వ బుజాన బరువు మోసి
అలసిన మెదడున అమ్మచేరి ఒడిన ఆడు వేల
ఆకాశంలో గుంపులుగా  పక్షులు గూళ్ళు చేరే వేల
కష్టమెరిగిన మేనుకు ఇల్లు గుర్తుకు వచ్చి రోడ్డు నిడిన వేల
ఆకలి దప్పులు నింప పూటకూళ్ళు మెరిసిన వేల
వయసు భేదం లేక పచ్చని ప్రకృతి అంచున
వెచ్చగ మనసు అల్లరి చేయు వేల
చీకటి పడు వేల
అలసిన తనువుల సేదలో
మనసులు వికసించును
తెల్లని మల్లె పువ్వుల్లా !

కృష్ణ మణి I 24-01-2014

Wednesday, January 22, 2014

మొగులు


శీకట్ల
మీదికి సూస్తే మొగులుకు
మసి ఊషినట్లు గమ్మత్తుగా ఉన్నది
ఆడ ఆడ ఇంత కాంతి మెరుపులు !
భుమ్మీద బరువును
పరిది దాటి ఆవతల పొతే
దూది పింజలాగ ఎగురుతూ ఊగుతూ
ఒక్క దగ్గర ఉండనియ్యక
కింద మీద పడుడు జూసి పక పక నవ్వుతున్నట్లు
అందని దూరాన అందమైన సుక్కలు
మినుకు మినుకు మంటున్నాయి

చాల రోజుల నుంచి మతిల ప్రశ్నలకు
జవాబు దోర్కుతదని ఆలోచిస్తున్నా
ఎప్పడికి జువ్వుమని గాలి అరుపులు ఇనుకుంట
మధ్యలో ఎక్కడో దూరాన మిడతల లొల్లి
ఒక తీర్గ అది బయపెడ్తుంది

నాకు స్వర్గం సూడాలనుకుంటున్న
ఇది నరకమా అని ఇంకో వంక బెదురు
అక్కడక్కడ పొగ ముసుర్కుంది
దగ్గరికి జరిగి చూసిన బూజు పట్టినట్టుంది
చెయ్యాల్సిన పనేందో మరిచిపోయినా
ఇంతలనే భూమి ఎనుకకు గుంజుతుంది అనుకుంట
తిరిగి వచ్చు దారిలా తెల్లని తెప్పాలను చూసి
ఇసుంటివి అక్కడ కూడున్నాయనిపించింది
నీలం రంగు నీళ్ళు
భూమి పచ్చగా ఎర్రగా వింతగానిపిస్తుంది
చెట్లమీద చినుకు లెక్క జారి
భూమి మీద పడ్డ కోతి లెక్క

ఏదో సాదించిన గర్వం
గుండెల పొంగుతుంది 

దీర్గాలోచన

నా చుట్టూ అంతా ఎడారిలా ఉంది
ఎటు వేళ్ళలో తెలియని ఆరాటం
ఒక పక్క బాద్యత ఇంకో పక్క అవసరం
అర్ధంకాని దీర్గాలోచన

నా పిల్లలు అల్లరి గెంతులు
అది చూడ
మునుపు కళ్ళు ఆనందంతో మెరిసేవి
ఇప్పుడు విసుక్కుంటున్నాయి
రోడ్డుపై నడుస్తూ ఎదుటి వారిని పలకరిచెవాడిని
ఇప్పడు తల ఎత్తలేని చిన్నతనం
పదిమంది ఉన్నా షాపువాడు
ఏమియ్యమంటారు అని మర్యాద చూపేవాడు
ఇప్పుడు కొద్ది సేపు ఆగమంటాడు
స్నేహితులు కనిపించి ఆగవేరా అనేవాళ్ళు
ఇప్పుడు మొహం తిప్పుకెల్తారు
ఫంక్షన్లో బందువులు
ఆ విందుకు రాలేదు
ఈ పెళ్ళికి కనిపించలేదు అనే వారు
ఇప్పడు వచ్చావా అంటున్నారు
నేనేమన్నా నా భార్య
పనిబాట లేని వాడు ఇలానే అంటాడు
అని అంటుంది

కాళ్ళు విరిగిన అవిటివాడను
బతుకు బరువై
కాసు కారక కాని వాడిని
కాలానికి ఎదురు కాడను

 కృష్ణ మణి

Tuesday, January 21, 2014

అహంకారధికారమ్

*************
అంతానికి అహంకారం ఆదిబిందువు
తెలిసి మసలరా నేర్పుగా !

దొడ్డి దారిన వచ్చి దొంగాటలాడితిరి  
తిన్నదేమో అరగక పొట్ట బలిసి ఉరిమితిరి
ఉన్నదంతా మాది
ఉన్నదేంది మీది ? అని
ఒండ్రుకప్పలమోత

రొక్క మూటల చెంత
అడుగు జరుగు యాల
ఇంకేంది అధికారం !

అడ్డగోలు గెంట్లు
ఇంకెన్ని పెడతరు
గీత దగ్గరుంది
పడుతదాగు దిక్కారం
పొతదింక గ్రహచారం 

కునుకు పోయి గుండె జారి
కలలు చెదిరి కలత చెంది
కన్నబిడ్డల బతుకు కోసం
గతమునొచ్చి పిడికిలెత్తి
బండగొడితే ఎట్ల పగలదు నిండు రెండుగా ?

కృష్ణ మణి I  

మనసు - మనిషి


ఎండిన కాలాన చినుకే అమృతం
పండిన సమయాన అదే విషం

మనిషి మంచి జరిగిన తట్టుకోలేడు
అలాని చెడు జరిగిన ఓర్చుకోలేడు
పలుచని మనసుకి ఎన్ని కన్నాలొ
ఎదిగిన మనషికి అన్ని అవధులు

మనసు వేదనను భరించదు
మనిషి దెబ్బలు సహించడు

శారీరక గాయాలు కొన్నైతే
మానసిక శ్రమ ఓ పక్క
కష్టించి ఫలితాన్ని పొందే గడియన
అనుకున్నది అందక చింతన
అందింది చూసి మురువక
తనకు తాను నిందనో లేక పరనిందనో

కణ కణమని ఎగసే నిప్పు కణికలు
జల జలమని పొంగే కొండ వాగులు
చక చకమని మెరిసే గడ్డి పోసలు
పక పకమని నవ్వే రామ చిలకలు

లోకాన అన్ని ఓర్పుకాసి నేర్పు చెంత
ఒడిదుడుకుల సహవాసం చేసినవే !

కృష్ణ మణి

Saturday, January 18, 2014

ఆశవై


బోసి మొఖమున తేనె పలుకు
''అమ్మ'' అనగ కళ్ళు చేమ్మగిల్లెనో
చిట్టి పాదాలు  అమ్మ యదపై ఆడగా
మనసు పులకరించెనో
చేతులెత్తి తండ్రి మీసం తట్టగా
మురిపాన గర్వమొందేనో
బుడి బుడి నడకల
తప్పటడుగుల ఆటలు
ఇల్లంతా గల్లాటతో తడిసెనో

బట్ట కట్టి బడికి వెళ్లి
బలపమాడి
చదువు నేర్చి
లోకమెరిగి
స్థానమెరిగి
దీన జన శోకమెరిగి
మనసు కరిగి
రక్తమ్మరిగి
పంటి అంచున కసిని పట్టి
అడుగులెరిగి

బగ్గ బలిసిన కావరాన్ని  అదమ తలచి
పొగరు బట్టిన గిత్తలూరుముల ఎదురు నిలిచి
పెన్ను ఎత్తి మేలుగొలిపి
బడుగు కన్నుల వ్యదను తుడువ ముందు నడచి

లాఠి తూటాలను అడ్డుపెట్టి అణగదొక్కే
రాజనీతుల అహంకారము ఊడగొట్టే
గోళాలై
ఫిరంగి శబ్దాలై
అగ్గి రవ్వలై
బొగ్గు ముక్కలై
ఇనుప చువ్వలై
దంచు సుత్తెలై
వేట బాకులై
తపంచ నొక్కులై
నిలచెను అన్నవై

అడవి గుట్టల
బెదురుమాని
ఎక్కుపెట్టి
రక్తమొడ్డి
నేల రాలి
తిరిగి వచ్చే
తల్లి ఒడికి

జనసంద్రమున సాగెను పూల నావపై
తోటి పక్షుల వెలుగు దివిటివై
చుక్కల్లో ఎర్ర మెరుపువై
ఉందువు కలకాలం బడుగులాశావై

Thursday, January 16, 2014

ప్రార్థన

జీవితం ఎంతో గొప్పది
అది మన దేశం ప్రాంతం కన్నా మిన్న
ఎందుకంటే పుట్టిన ప్రతి వాడు
నా దేశం నా మతం
అంటూ విద్వేషాలు పెంచు నీచ క్రీడలో పావులై
భగవత్స్వరూపుడైన మనిషి

అంతా నేనే అను విశ్వాత్మ కు అంశమని మురిసి
అహంకారమున అన్ని ఒలిచి
ఒకనికొకడు మిత్రత్వం మరచి
భూమిని ముక్కలుగా మలచి
నేను నా దేశం అంటూ పక్క వాళ్ళను చెరచి
భాషాద్వేషం ఉంచి
మతమను మూడ్యం పెంచి
మానవత్వం అను భావం తుడిచి
రక్తమను దాహం కాంచి
నరమేధం చేయ తలచి

మృత్యు కలెబరాలతొ నృత్యం
చేస్తూ దేవుని సందేశం అంటూ నిత్య ఘోష పెడుతూ
పరమాత్మను మలినం చేయు ముర్ఖపిపాసుల
మసి మనసుల మార్చుటకై
ప్రేమ అను చల్లని గాలి వీచి
అంధకార పంజరాన్ని విప్పి
కాంతి అనే నిజ వలయంలో స్వేచ్చ జీవులుగా
మార్చుమని ఆ సర్వేషుని సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను

తొవ్వ

కన్నీళ్ళలో కష్టాల పడవలు....
బతుకుపొలం నిండ పరిక్కంప

ఏ గడియల కన్నదో మాయమ్మ నన్ను...
పురిటియాల్ల ఆ తోకచుక్కకు కడుపెందుకు నొచ్చిందో ?
అడుగడుగునా అడ్డమొచ్చే కంపలెన్నో
ఈ తొవ్వ ఆగుడెప్పుడో ? నే పానమిడిశేదెప్పుడో ?

అప్పు జేసి ఇత్తుమందులగొంటే
కండ వుండి చమట చింది
చేసిన కష్టమంతా నీళ్ళ కిందే  !
ఎత్తి పొస్తి మడుగులన్ని
గాలి తిన్న కొమ్మ రెమ్మ
అంతలోనే ఆగనంటు సర్రు సర్రున తెప్పలొమ్పె !

కోతకొచ్చిన పంట
పోట్ట నిండని గింజ
నీళ్ళు ఎండిన బాయి
అడుగువట్టిన బోరు
ఉన్నఅడుగు వోమ్పుతుంటే
లైటు లేక ఎక్కిరిచ్చె !


కూలి కైనా పోదామంటే
పనులు లేక పస్తులాయె
ఏమి చెయ్య తొయలెక
నెత్తికెమొ చెతులాయె
ఉన్నయన్ని అమ్మజూపితి
కడుపుకైన గంజి లేక
లోతుకన్ల దిక్కులాయె
ఎదురుసూపుల ఎండా కింద !

ఎట్ల నడుసుడు మున్దుకింక
ఒమ్పులన్ని మిట్టలాయే !
ఏమి చేదును బతుకుకింక
పురుగుమందే తోడుకాయే !

Tuesday, January 14, 2014

అడవి


ఎటుచూసిన కొండలు ఒంపులు మిట్టలు
వాటి పైన నిండుగా పరుచుకున్న పచ్చదనం
చిన్న మొక్క పెద్ద మొక్క
చిన్న చెట్టు పెద్ద చెట్టు
పొదలు గడ్డి పరకలు
అక్కడక్కడ రంగు రంగుల పూలు
నీటి గుంటలు లోయలు
రాళ్ళు రప్పలు
నయనానందకరం !

అంతేనా
నీటిలోన కప్పలు చేపలు
నీటిమీద కొంగలు
పొదల చాటు పాములు
ఎదురోచ్చు మున్గీసలు
దప్పికై దున్నలు
పొంచివుండు మొసళ్ళు
గెంతులేసు జింకలు
కాపు గాచే పులులు
పచ్చ గడ్డికై  కుందేళ్ళు
కొమ్మలపై గద్దలు
జీవన పోరాటం !

పిల్లలు ఆ ప్రాంతన్నేమంటారు ?

కృష్ణ మణి 14-01-2014

Monday, January 13, 2014

మా ఊళ్య సంకురాత్రి

మా ఊళ్య సంకురాత్రి
__________________కృష్ణ మణి

పండుగకి ముందే పతంగుల జోరు
మాంజ చెయ్యనికె
ఊరెనక బొడ్డురాయి రోలు
అన్నం సీసం
కలమంద కారం పసుపు

దంచాలె ముద్ద తీసి దారానికి పుయ్యాలె 
ఆరవెట్టి చరక సుట్టాలే !

పండుగ రాంగనే
భైండ్ల ముత్తయ్య దుక్నం పోయి
పతంగుల కొంకోవాలె
లేకుంటే బాన్ష వట్టి
ఒరాల మీద
గుండ్ల మీద కూసోవాలె
తెగివడే పటాల పట్టాలే

గాలిలెగిరే వింత పక్షులు
అర్ధం కాక  పక్షుల బెదురులు
ఏది తెగునోనని పరాషకాల బెట్టులు !

ఆకలై
అమ్మ జేసే ముర్కు గారెలు యాదికొచ్చి
కాల్లునొయ్య ఇంటికొచ్చి
కడుపు నింపి
ఇంకొన్ని జేబ్ల వెట్టి

కడపల మీద ముగ్గులల్ల 
చెర్కుల్ని రేగ్వల్లని జీడిపండ్లని  
ఇంకా చెంగెబూట్ని
ఎదుర్కోవలె
అమ్మ సూడకముందే పరార్ గావలె !

గంగిరెద్దుల ఆటలు 
గమ్మత్తైన శల్లలు
ఆకిట్ల మెరిశిన రంగు ముగ్గుల వెలుగులు  !

సంకురాత్రి కాంతి
ఉండునందరి పైన
రాదు మల్ల జన్మ
ఇంత కన్నా మిన్న!

కృష్ణ మణి   


నింగి


ఆకాశాన అందని ఎత్తున ఎవరో ఊ కొడుతున్నారు
ఎవరని ఆ నింగిలో నక్షత్రాల వెనక వెతికాను
దట్టమైన పొగ మేఘాల్ని దులిపి చూసాను
అంతా చీకటి ముందు చిందులేస్తున్న మెరుపులుగ ఉంది
కొన్ని తారలు నాతొ దోబుచులాడుతున్నట్టుంది
అక్కడక్కడ తోక చుక్కల పయనం దీపావళిని గుర్తు చేస్తున్నాయి
ఆ సుందర దృశ్యాలు ఎప్పటి నుంచి అలా ఉన్నాయొనని ఆలోచన
మ్మ్మ్మ్.......... అని చెవుల్లో మారుమోగుతుంది
ఒక గాలి నిరంతరం ఒకేల దివి నిండా వ్యాపించి
ఈ అనంత కోటి బ్రహ్మాండాన్ని శాసిస్తుందనుకుంటా
బహుశ నే విని వెతుకుతున్నా శబ్దం ఇదేనేమో
ఆది అంతం ఉందేమోనని వెతికాను
నిలువుగాన అడ్డంగాన నే వెళ్ళాలి
ఎటు వెళ్ళాలో తెలియక కొంత తిరిగాను
అలసిన మనసున విసుగుతో వెనుదిరిగాను

చటుక్కున మెలుకువ వచ్చింది అలారం గోలకి
అది కల అని నవ్వు రాలేదు
అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది

         కృష్ణ మణి I 14-01-2014

Sunday, January 12, 2014

దయ్యంబట్టింది



అర్ధ రాత్రి పన్నెండు దాటింది
ఊరవతల మర్రి చెట్టు
చెట్టుకవతల బొందలగడ్డ
మాఓడక్కడ
చెట్టుకింద నేను
వాంతో పాటే పోవాల్సుండే
దూరాన గాలుల ఇంత సప్పుడ్లు
ఆ పక్క కుక్క లొర్లుడు
సుట్టు సల్లగుంది
నాకేమో చమటల్వట్టినయి

ఇంతకీ మేమెందుకొచ్చినమంటే
నా జతోడు పగటిల్ల్య
బర్లుగొట్టుకోనొస్తుంటే
ఆ బొందలగడ్డ మీద
ఏదో బంగారం లెక్క మెరిశిందాంట
పక్కోనికి చెప్తే ఉరికీత ఓయి
ముంగల తీసుకుంటాడని జెప్పలే
తెల్లందాకయితే ఎవరు సూడరని
నన్ను జతకువట్టుకోచ్చిండు

ఆడింక రాడు
నాకేమో భయ్యం
ఆడిదాక రారా అంటే ఓలే
ఈడక్కోన్నైన
ఆడొక్కడయ్యిండు
ఆగుతలేదు పాణం

ఏమో ఒర్లవట్టే వాడు
దమ్ముదీసుకుంట ఉరికిన వొంకుకుంట
కింద వడి కాల్జెయ్యి కొట్టుకుంటుండు
అసలే డర్రుగాన్ని
గుండె జారినట్లయ్యింది

తర్వాతెమయ్యిందో తెల్వదు
తెల్లందాక మా ఇంటోళ్ళు ఆనింటొల్లు
దేవ్లాడిన్రంట
పొదుగల్ల సూశి లేపిండ్రు
అసల్సంగతి జెప్తే కొడతరని
ఏమో మాకెర్కలే అన్నం

దయ్యంబట్టింది కొడుకులకని
కోళ్ళు దిమ్పేశిన్రు
కళ్ళు ఒశిన్రు
కార్జం బోటి సాలన్నదాక పెట్టిన్రు
ఒకరినొకరం సుస్కోని నవ్వుకున్నం
దయ్యమొదిలందని
మురిశిన్రు మాఓల్లు

ఇకజాల్ నవ్వొస్తుంది

Saturday, January 11, 2014

మా పల్లె సుడు


మా పల్లె సుడు
మట్టి పరిమళాల పొదరిల్లు
ప్రకృతి ఒడిలో పిల్లలం
చిగురుటాకుల మీది చినుకులం

పసుపు కొమ్ముల మీద పోట్టులం
ఆరోగ్యంలో నవ నాగరికతకు పాదులం !
జొన్న రొట్టెల బలం
రాగి సంకటి సలువ
సజ్జ గట్కల గుణం
రొగమెరుగని కష్ట జీవులం

పెండ నీళ్ళా సాన్పి
సుట్ల ముగ్గుల కాంతి
కడప మీది పసుపు
ఆవు పంచకం శుద్ధి
ఇంత గొప్పా నేర్పు
జగము మెచ్చిన సత్యం

కోడికూసిన యాల
ఊరు కదులును ఈడ
కాయకష్టమే అండ
యాష్ట అన్నదే లేక
చెమట ఒమ్పిన కండ
ఇల్లు నిండునే ఇంక

ఆటపాటల తోట
జానపదులా జాతర
జంగమయ్య గవ్వ
కాటిపాపల విద్య
ఒగ్గుకతలా జోరు
సివసత్తులా పలుకు
యాపకోమ్మల ఆట
భొనమెత్తిన పడతులు
గ్రామదేవతలా కొలుపు



కలుగును జయమిక


ఎండలో దప్పిక
నీళ్ళను ఎరుగక
ఊపిరి వదలక
బతుకుట తప్పక
దొరకునని వదలక
వెతుకుట ఆపక
కలుగును జయమిక !

ఓర్పును చెదరక
దేనికి బెదరక
పరుగులు చక చక
ఉండదు తీరిక
రేపటి రోజిక
ఉండదు తిక మక
అందుకే పోగిక
కలుగును జయమిక !

వణికిన తనువిక
చెదిరిన కలయిక
మాసిన పువ్విక
చేయ్యును రణమిక
ఒరుగును బలమిక
తెగువకు వరమిక
కలుగును జయమిక !

దెబ్బలు మాయక
కారిన కన్నిక
ఎగురును ఎంచక
బలిశల సానిక
కావురం తెగునిక
వచ్చును బదులిక
మోగును ధరువిక
కలుగును జయమిక !

ఒక తీగ

సన్నని ఒంకలతో సాగుతున్న సెలయేరులా
తాడుకు అల్లుకున్న తీగలను చూసాను
అవకాశాన్ని అందుకున్నామని  మురిసిపోతున్నాయి  !

సూర్య కాంతిలో చిగురుటాకుల నిగ నిగలు
ఉద్భవించిన నవ యువ కెరటాలు మాదిరి
ఉప్పొంగిన తేజస్సుతో  ఉన్నాయి !

చిట్టి చిట్టి మొగ్గలు నేనెప్పుడా వికసించేది
అని ఇక ఆగను మాపంటు ఈడుకొచ్చిన
లేగా దూడలా తొందరపడుట్టున్నాయి  !

దాచిన పుప్పొడిని చూపుతూ
విరిసిన పువ్వులు ముగ్దమనోహర
సౌందర్య కాంత వలె సుకుమారంగా చూస్తున్నాయి !

అక్కడక్కడ పిందెలు పెరిగిన
కాయల జూసి వెకిలి నవ్వులు ఆపుమని
రేపటికి పోటి పడుదుమని ఈర్శపడుతున్నాయి  !

కడుపులో లెక్కకు అందని గింజతో పండ్లు
రేపటి తారానికి బాటలు వేస్తున్న
గర్భిని వలె ఆపసోపాలు పడుతున్నాయి !

                    కృష్ణ మణి 

Wednesday, January 8, 2014

నాకు ఇంకా యాదికే !


ఎండమాయి
చెరువు కట్ట
చింత చెట్టు
ఊరిమీది ముచ్చట్లు
నక్రాలువడి గొప్పలు
కడుపువట్ట నవ్వులు
నాకు ఇంకా యాదికే !

నడూర్ల సందడి
కోమటొల్ల యాకిలి
పొక్కిలి జేసి ఆటలు
లచ్చమ్మ ఒర్లుడు
ఈడంటే ఈడంటూ
ఒకనిమీద ఒకడు
నాకు ఇంకా యాదికే !

చిత్తల్కాయలదెమ్పి
ఎండిన కంపలదెచ్చి
కాలవెట్టి  పొగలతోని నోట్లవెట్టి
మిగిల్నయన్ని పంచుకువొంగ
చేల్లెన్లు మురుశిన్రు
మాయన్న దెచ్చె ఇన్నిగనమని
నాకు ఇంకా యాదికే !


అగ్గికురిసే యాల
అందరం కప్పలమే
ఈరంబాయి మోట మీద
దొరకవట్టుడు ఆటలో
ఈడ మునిగి ఆడ
ఆడ మునిగి ఈడ
నాకు ఇంకా యాదికే !

కిరాయి సైకిలున్నోడు
దమ్మువట్టినంక యియ్యాలె
అప్పట్దాక  మొక్కులే
యాష్టకొచ్చిన్దాక  తొక్కాలె
నాకు ఇంకా యాదికే !

బూషి మొఖాన దువ్వని జుట్టు
శీమిడి మీసాల నవ్వువోని తనం  
చెడ్డి గుంజి మొలతాడు ఎక్కించి
మోకాళ్ళ పుండు కార్తున్న సీము
గుండీల్వోయి కాంటలే గతి
చేత్లవడితి ఇన్ని పుస్తకాలు
తెగిన చెపుల్నిసరిజేస్కొని
ఒరాల మీద నడుసుల్లు
నాకు ఇంకా యాదికే !
 
                                  Krishna Mani

Tuesday, January 7, 2014

ప్రేమ వినప్పం


ముద్దు ముచ్చట్లలో
కాలం తెలియని వేల
చెరగని చిరునవ్వుల
నీ మొహాన్ని
అదే రీతిగా చూడాలని !

మాటలకందని రూపాన్ని
మదిలో చేక్కి
నిత్యం నా మాటల మల్లెలతో
అభిషేకించాలని !

నీపై సోకినా ఎండను
తట్టుకోలేక సదా నీ
రక్షకుడనై పంచ దిశల
ప్రహార కాయలని !

నిను తాకినా గాలి
పరిమళ భరితమై
నను చేరి మత్తులో
జీవితం గడవాలని !

నీ పెదాలకంది
నేల రాలే సకలం
అందుకొని అమృతమని
ఆస్వాదించాలని !

తన్మయత్వం పొందని మది
వస్త్రమై నీ చుట్టూ అల్లుకొని
పువ్వువలె మెత్తని సుఖాన్ని
ఇచ్చి నీలో భాగామవ్వాలని !

నా మనసు ఇచ్చే ఈ సుమధుర
భావనలు నాపై నీ మనసు పారి
ఈ ప్రేమ విరహాగ్నిని చల్లార్చి
నీ ప్రేమ పంజరములో బందీని
చెయ్యవే నెరజాన !

                                              కృష్ణ మణి 

Monday, January 6, 2014

సాగర గర్భం


సాగర గర్భం సంపద నిలయం
కన్నుల పండుగ చూసిన మనసున !

మనిషికి దొరుకును పుట్టెడు ప్రశ్నలు
చేదితే కలుగును ఎరుగని బిందెలు !

ఇంద్ర ధనస్సుకే ఓర్వని తనము
లెక్కకు మించిన రంగుల సొగసులు !

ఏనుగుకు వచ్చును పట్టని దుఖము
తిమింగలం అందురు సముద్రపు రాజును
నోటిన పట్టును నవ్వుతు గజమును !

నేల నుండి విషాన్ని పొందును
బదులుగా నీటిని నింగికి వంపును
జలవృష్టితో భూమిని కడుగును !

శీతల ప్రాంతం నిండును మంచుతో
ప్రాణులను సాకును ఒడినిచ్చి ప్రేమతో  !

కడలి జీవులకు కన్న తల్లి
కొదువ రాదు ఎన్నటికి పాలవెల్లి !

                      కృష్ణ మణి

Sunday, January 5, 2014

భారత పద్మం


జగమునేలిన భారతం నాడు
శక్తుండి ముడిచిన  పువ్వు నేడు !

అవని సరస్సులో మెరిసే తామరం
అడ్డు తగిలే గుర్రపు డెక్కలను వంచి
జల తళుకుల ఉయ్యాలలో
ఊగుతున్న సౌందర్యం !

చుట్టున్న పాదులు ఎంత బిగ పట్టినా
చేతులెత్తి కిరణాలను ఓడిసిబట్టును
నేనున్నాంటూ ఉనికిని చాటును !
విచ్చుకొని మెరిసిపోవు
ఆకసమే మురువగా
సాగాలి ముందుకు
రావాలి ఎత్తుకు
జగాన చంద్రుని అందుకొను ఇంతలో
తెగువను చూపును అందరితో పోటిగా !

నిత్య యవ్వన కాంతుల భారత పద్మం !
సత్య ధర్మముల జాడకు మూలం !

                         కృష్ణ మణి 

Saturday, January 4, 2014

హోటల్

ఏమున్నాయి తినటానికి
పూరి ,ఇడ్లి ,దోస ,ఉప్మా ,వడ సర్
తాగడానికి
చాయి ,పాలు , కాఫీ ,బూస్ట్
ఇంక ఏమున్నాయి ?
మీకేం కావలి సర్ ? ఆశ్చర్యంగా
అబ్బే ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయో అని
ఒక నిమిషం సర్
చెప్పండి ...ఓకే....ఓకే
ఎనభై రూపాయలు సర్
ఇదిగో ఇరువై
రేయ్ సార్కు నలుగు ఇడ్లి పార్సిల్
అప్పటికే వెయిటింగ్ లో ముందు కస్టమర్ విసుగ్గా
పండ్ల రసాలు ఉన్నాయా?
లేదు సర్ ఆ సెక్షన్ పెట్టలేదు
ఇంకేం కావలి సర్ ?
దోసలో జీడి పప్పు వేస్తారా?
లేదు సర్
ఆలు మాసాలలో పల్లీలుంటాయి
కనీసం ఉప్మాలో నెయ్యి వేస్తారా ?
లేదు సర్
పెసర పప్పు ఇంకా శనగ పప్పు వేస్తాం
ఏటకారంగా ఉందా?
ఈ ఉరికి కొత్తా ?
ఎక్కడినుంచి ఇటోచ్చారు ?
క్షమించండి
ఇంతకీ మీకు ఎం కావలి సర్ ?
బిజినెస్ ఇద్దామని చుస్తే అవమానంగా మాట్లాడుతున్నావ్
ఏంటి కథ ?
సర్ ఒక నిమిషం
చెప్పండమ్మా ... ఓకే ... ఓకే
రేయ్ రెండు మసాల దోసె
యాభై సరి పోయిందమ్మా
 సహనంగా ''సర్ మీకేం కావలి ?''
ఏదడిగినా లేదంటావ్
నాలుగు బల్లాలేసి గల్లా పెడితే అయిపోయిందా ?
అసలు మీకు ఎం కావాలో చెప్పండి సర్ ప్రయత్నిస్తాను.
ఎన్నో కష్టాలకోర్చి ఈ హోటల్  పెట్టాను
నన్నిలా చంపకండి
ఎవడి కోసం ? నాకొసమా ?లేక  నా మనవాళ్ళ కోసమా ?
చేతులు జోడించి
సర్ తిన్నది చాలు ఇవాల్టికి,  భరిచలేను
ఇలా ఐతే దందా ఎం చేస్తావోయ్ ?
కాఫీ ఇవ్వు తాగి పెడతా

                        కృష్ణ మణి

Thursday, January 2, 2014

నా కసి


మనసు అలసింది
తనువూ సోలసింది
పిడికిలి బిగిసింది

నా జాగా మీద దండయాత్ర చెసిన్దెవ్వరని
కుత కుత ఉడుకుతూ నా రక్తం అడిగింది !
ఆవేశం అంచున గుండె దడగ్దగ్డమని
వెకిలి మాటల సంతను నిలదీసింది !

నేనడగ దలుచుకున్న
ఈ కుటిల మతుల నీచుల్ని
ఎవడు రమ్మన్నాడు నా ఇంటి పాలికి ?
ఎవడు వదలమన్నాడు ఆ డెర కోయ్యలని ?

మా మూతులగట్టి ఆనాడు నైజము
నా తల్లి కన్నీళ్ళ మూటగట్టి
తుపాకి గుండ్లను ఎదురుపెట్టి
ఉన్నోడిని లేనోడిని వేరుపెట్టి
పడతుల ఒలువల ఆరబెట్టి
భానిసవు నీవని బెదురుపెట్టి
నా ఆటపాటల్ని అదిమిబెట్టి

ఒర్చితిమి మా పండ్లు బిగిసిపట్టి
ఎదురుతిరిగి ఎవడు నీవని ఎండగట్టి
రక్తం ఒడ్డి ఉరవతలకి సాగానంపినం !

అమ్మా ! మనకు తెల్లారిందని దమ్ము తీసి
కండ్ల తుడచి నాగాలెత్తి సాలల్ల గిన్జబెడితే

మనమంతా ఒకటని పెద్దలను ఒప్పించి
మమ్ములను ఒత్తిపట్టి
మా ఇంట్లజోర్రి
బాసలను ఎడమరచి రాతలను కప్పిపెట్టి
దొడ్డిదారిన మీరంతా ఇల్లునిండి
మా పైన మీ చెత్తను రుద్ది రుద్ది
హీనంగా జూస్తిరి
మా జగాల జబర్దస్తి చేస్తిరి
మా కొలువుల కూసుంటిరి
కట్టలని తెమ్పితిరి
మా ఊర్లు ముంచితిరి
మా నీళ్ళను ఒమ్పితిరి
మా భాషను ఎక్కిరిచ్చి
మీ యాసను దాచిపెట్టి
పరదాల మీద పగలవడితిరి
మనదే అని మాదంతా మీకాడికి పంపితిరి

ఇంతజేసి ఇప్పుడు మీదేముందని
అంతా మాదేనని కారుకూత పెట్టి
మమ్మల్నే మా ఇంట్ల పారయోల్ల చేస్తున్నరు

నా కసి
మనసు అలసింది
తనువూ సోలసింది
పిడికిలి బిగిసింది
నా జాగా మీద దండయాత్ర చెసిన్దెవ్వరని
కుత కుత ఉడుకుతూ నా రక్తం అడిగింది !
ఆవేశం అంచున గుండె దడగ్దగ్డమని
వెకిలి మాటల సంతను నిలదీసింది !
నేనడగ దలుచుకున్న
ఈ కుటిల మతుల నీచుల్ని
ఎవడు రమ్మన్నాడు నా ఇంటి పాలికి ?
ఎవడు వదలమన్నాడు ఆ డెర కోయ్యలని ?
మా మూతులగట్టి ఆనాడు నైజము
నా తల్లి కన్నీళ్ళ మూటగట్టి
తుపాకి గుండ్లను ఎదురుపెట్టి
ఉన్నోడిని లేనోడిని వేరుపెట్టి
పడతుల ఒలువల ఆరబెట్టి
భానిసవు నీవని బెదురుపెట్టి
నా ఆటపాటల్ని అదిమిబెట్టి
ఒర్చితిమి మా పండ్లు బిగిసిపట్టి
ఎదురుతిరిగి ఎవడు నీవని ఎండగట్టి
రక్తం ఒడ్డి ఉరవతలకి సాగానంపినం !
అమ్మా ! మనకు తెల్లారిందని దమ్ము తీసి
కండ్ల తుడచి నాగాలెత్తి సాలల్ల గిన్జబెడితే
మనమంతా ఒకటని పెద్దలను ఒప్పించి
మమ్ములను ఒత్తిపట్టి
మా ఇంట్లజోర్రి
బాసలను ఎడమరచి రాతలను కప్పిపెట్టి
దొడ్డిదారిన మీరంతా ఇల్లునిండి
మా పైన మీ చెత్తను రుద్ది రుద్ది
హీనంగా జూస్తిరి
మా జగాల జబర్దస్తి చేస్తిరి
మా కొలువుల కూసుంటిరి
కట్టలని తెమ్పితిరి
మా ఊర్లు ముంచితిరి
మా నీళ్ళను ఒమ్పితిరి
మా భాషను ఎక్కిరిచ్చి
మీ యాసను దాచిపెట్టి
పరదాల మీద పగలవడితిరి
మనదే అని మాదంతా మీకాడికి పంపితిరి
ఇంతజేసి ఇప్పుడు మీదేముందని
అంతా మాదేనని కారుకూత పెట్టి
మమ్మల్నే మా ఇంట్ల పారయోల్ల చేస్తున్నరు !
పాలకుడే పరాయోడయ్యిండు.. ఏ
పట్టెన మా తిప్పలు మా గోసలు
అంత చూసి ఒళ్ళు మండి
అగ్గిరవ్వలై
మీ మీద కుండ పోతలమైతే
ఎ గొడుగులు ఆపేవు
ఎ మడతలు దాచేను !

అందుకే అంటాం
పోరా పోరా  పోరా ....
పోకుంటే చెడ్డి గుంజి పెడతాం
ఎవరికీ సూపలేని తావులల్ల
పోరా పోరా పోరా .....
ఉన్డున్రి మాతోని మా మాటకు కట్టుబడి
లేకుంటే ముతిబొక్కల  రాలగోదతాం
మీ వేషం మాకొద్దు మీ సోకులు మాకు పోట్లు

అందుకే అంటాం
పోరా పోరా  పోరా ....
పోకుంటే చెడ్డి గుంజి పెడతాం
ఎవరికీ సూపలేని తావులల్ల
పోరా పోరా పోరా .....

మసి చీమలు

ఎగిసిపడే అలలను ఆపలేని సత్తువలో
కష్టమనే లోకానికి దారేదైతే ఏంది ?
ఆగని కాలానికి కదలని బతుకు
ఎండిన మొద్దుకు  చిగురని ఆకు !

అడుగేసి పరిగెడితే అడివంతా ముల్లుంటే
కంపల వలలో బండలే దిక్కైతవి !

నిశీది పంచన సుడిగాలిలో
కుక్కలవలె విశ్వాసముంచి
ఆకలిదప్పులకోర్చిన మసి చీమలు !

పడిన పాట్లను పక్కన పెట్టి
ఆరని మంటల్లో కాలే కడుపులే
శివాలెత్తి పదం పాడి కదం తొక్కి
వీరతాళ్ళతో విరుచుకు పడతాయి !

భరిసెలనెత్తిన బడుగులు
బలసిన కొండల గొంతును కోయగా
నడిచోచ్చును నవీన ప్రమానత్వం సమానత్వం !