************
అమ్మానాయిన కష్టం
తిండికే సరిపోక పొతే
నడవని పయ్యల బతుకు బండిల
మా సదువులెట్ల సాగుతయి
అందుకే మావొళ్ళు
సర్కారాస్టల్ల ఎశిన్రు నన్ను !
కడుపునిండ అన్నం
ఎసుకోనికే బట్టలు
పండనీకే దుప్పటి
ఆడుకోనికే అన్నీ
అన్నీ ఉన్నా అమ్మ లేదు !
మా ఇంటికాడ సోపతోంతో జగడమాడితే
తల్లి పెట్టోలె మా అవ్వ ఉరుముతుండె
ఏడిస్తే దెగ్గరికిదీషి అదుముతుండె
ఈడనేమో మూలిగిన గాని ముట్టరాయే !
గిన్నెవట్టి గోలుసుగడితే అన్నముంటది
లేకుంటె అయ్యల్ల కడుపు కాలుతది
అమ్మ ఐతే పూట పూటకు తింటలేనని తిడుతుండె
అన్నకాడికి లేదనక నింపుతుండె !
మా నాయిన వారమైతె
అక్కడిక్కడ ఓయి పట్టుకొస్తుండే
చెర్ల శాపలేమీ
ఎండ్రికిచ్చలేమీ
శేనుకాఏమీ
తాటిమున్జలేమీ
ఇప్పుడేమో కోడిగుడ్డు కూడ ఉడకదాయే !
గిన్నెకడిగి
బట్టలుతికి
పెయ్యి తోమి
ఉరుకుల పరుగుల ఇస్కోలాయే
మనసుకారి చెప్పు కుందామంటే
తోడబుట్టినోల్లు కారాయే
అమ్మ నాయిన తోడులేరాయే
యాదికొచ్చి నాలుగురోజులకే
పానమింతాయే !
కృష్ణ మణి I
No comments:
Post a Comment