********
గమ్యం తెలియని బాటసారిని
ప్రశ్నలు గుప్పిస్తుంది నడక ఆగక
దారులు కనిపిస్తున్నాయి
ఎటెల్లాలో ?
దేహం అలసి ఊగుతుంది విసుగ్గా
కళ్ళు చిట్లించుకొంటున్నాయి ఇంకెంతని చూడాలని
ఎలుకల గోలకు మసలుతుంది కడుపు ఎంతకాలం ఈ పాట్లని
గడచిన దారిలో ఎండమావులే ఎక్కిరించగా
నడిచే బాటలో పువ్వులు ముడిచి ముళ్ళే పొడిచెను !
తడబడు అడుగుల
గజిబిజి మనసున
మాసిన మొఖమున
సాగని బతుకున
ఆగని గుండెను
ఆపే పోరులో
గెలుతును నేనని
చేసిన బాసలో
ఓడిన తనమున
ముడిచితి తనువును !
పోవుట తప్పక
నేర్చిన నడకన
రేపటి సంతకు
కాగడ వెలుతురు
కాన కొనకు !
కృష్ణ మణి I
No comments:
Post a Comment