Sunday, February 14, 2016

అరుణ్ సాగర్ సర్ మృతి సంతాప కవిత

__________ క్రిష్ణ మణి

మానవ అరణ్యంలో మలిన్యాలను ఏరి
అరుణకిరణాలతో శుద్ధిచేసే అక్షర శరం
సున్నితమైన చూపుతో మనసులను తాకిన హ్రుదయం
ఇక భౌతికరూపాన్ని కోల్పోయిందనే బాధ
మము శోకసాగరంలో మించింది
ఇదే మా శ్రద్దాంజలి
సదా మీ ఆశయానికి మా పుష్పాంజలి

పానుపు పాట్లు

పానుపు పాట్లు
_______________కృష్ణ మణి

అరె ..... గుడ్ నైట్ అయిపొయింది
మధ్యరాత్రి రెండు గంటలకు
దోమల పలకరింపులో మిగత రాత్రి తెల్లవారింది

కండ్లు కుచ్చుకొని ఎర్రబడి
మొహం ఉబ్బి
ఒళ్ళు తుళ్ళుతుంది
అయ్యో .... అప్పుడే ఏడయ్యిందా .....?

పిల్లలకు పాలు తేవాలని పొతే
పాలవాడు నిద్రమత్తులో
ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ కలిపినట్టుండు
పాలు గంజిల మారి
చాయి చేదయ్యింది !

ఈడ్చుకొంటూ రోజు మొదలయ్యింది
టైరు పంచర్ అయినట్టు  
నోటికి ముద్ద దిగదు
ఒంటికి రెస్టు లేదు
కంటికి కునుకుపాట్లు

చుట్టూ ఉన్న మిత్రుల
ఎక్కిరింపుల పలకరింపులు
ప్రాణం జారింది అవమానంగా
నరకంలో కూర్చునట్టుగా
గడియారం ముళ్ళను లేక్కబెడుతూ గడిపాను  !

హమ్మయ్య .....
హస్తమిస్తున్న సూర్యున్ని మనసున హత్తుకొని
పద పదంటూ ఇంటికి పరుగుబెడితే
ముల్లకంపలో చిక్కిన పిట్టలా
బైక్ ట్రాఫిక్లో ఇరుక్కుంది !

చెదిరిన నవ్వును ఎంత బిగబట్టి చూపినా
నా దీనావస్తను గమనించిన పిల్లలు కూడా నవ్వలేరు మురిపెంగా
కునుకు కోసం కురుకుపాట్లతో నేను
తల్లో మల్లెలతో మా ఆవిడ
లోకం మరిచే నిద్ర పట్టింది  
కనులు కలువల్లా విచ్చుకొన్నాయి పొద్దున్నే హాయిగా  

కాని ఏం చెయ్యను
విసుగుతో ఎదురొచ్చింది  
చాయ్ కప్పు ......!
  

కృష్ణ మణి 

Wednesday, February 10, 2016

కాల సర్పం


కాల సర్పం
____________________కృష్ణ మణి

కరెంటు వైర్ల మీద కాకి పీనుగుల స్వాగతాలే కదా
రోడ్డు పక్కన తోరణమై పలకరిస్తుంది నా ఊరి ముందు !

మోడువారిన గల్లీలళ్ళ   
ఎగురుతున్న ప్లాస్టిక్ బ్యాగులేగా
నను జూసి నవ్వుతున్నై !

దుర్గమై నిలబడ్డ బూరుగు చెట్టు
ఇప్పుడు నేలకూలి భూమికి సామనమై
రేపో మాపో మునుగుతానని ఏడుస్తున్నట్లుంది
సర్కారు తుమ్మలు మెల్లంగ
రాజ్యమేలుతున్నట్లుంది ఊరిని !

మసక చూపుతో
మల్లయ్య తాత ఎదురొచ్చి
కంకరనెత్తే కన్నపిల్లలెట్లున్నరని
గుండె చెరువు చేసుకొన్నడు

వండ్రగులు అవుసులోళ్ళు
కమ్మర కుమ్మర సాకలోళ్ళు
సావుజాలక బతుకీడుస్తున్నరు
పట్నం సోకులు పల్లెకంటగా !

చెరువు అలుగుపారి పంటకందక
పొట్టెండి పొళ్లు పొళ్లు తాళ్ళు రాలే
దూపకు నోరెండి కట్టమీద పిట్టే కుములవట్టె
పెద్దబోజల జాతరలో జీవుల గుడ్లెండే

పండుగపొద్దుకు ఎండపొద్దుకు ఇలువలేక
ఊరు గొడ్డుబోయి గొడ్లన్ని తబెలాల బాయిలవడే    
మనిషికి మనిషి రక్తం మిగులవట్టే ఆఖరికి
ఆడు మునిగి పుట్టే ముంచిందన్నట్లు !

కృష్ణ మణి