మా పల్లె సుడు
మట్టి పరిమళాల పొదరిల్లు
ప్రకృతి ఒడిలో పిల్లలం
చిగురుటాకుల మీది చినుకులం
పసుపు కొమ్ముల మీద పోట్టులం
ఆరోగ్యంలో నవ నాగరికతకు పాదులం !
జొన్న రొట్టెల బలం
రాగి సంకటి సలువ
సజ్జ గట్కల గుణం
రొగమెరుగని కష్ట జీవులం
పెండ నీళ్ళా సాన్పి
సుట్ల ముగ్గుల కాంతి
కడప మీది పసుపు
ఆవు పంచకం శుద్ధి
ఇంత గొప్పా నేర్పు
జగము మెచ్చిన సత్యం
కోడికూసిన యాల
ఊరు కదులును ఈడ
కాయకష్టమే అండ
యాష్ట అన్నదే లేక
చెమట ఒమ్పిన కండ
ఇల్లు నిండునే ఇంక
ఆటపాటల తోట
జానపదులా జాతర
జంగమయ్య గవ్వ
కాటిపాపల విద్య
ఒగ్గుకతలా జోరు
సివసత్తులా పలుకు
యాపకోమ్మల ఆట
భొనమెత్తిన పడతులు
గ్రామదేవతలా కొలుపు
No comments:
Post a Comment