సన్నని ఒంకలతో సాగుతున్న సెలయేరులా
తాడుకు అల్లుకున్న తీగలను చూసాను
అవకాశాన్ని అందుకున్నామని మురిసిపోతున్నాయి !
సూర్య కాంతిలో చిగురుటాకుల నిగ నిగలు
ఉద్భవించిన నవ యువ కెరటాలు మాదిరి
ఉప్పొంగిన తేజస్సుతో ఉన్నాయి !
చిట్టి చిట్టి మొగ్గలు నేనెప్పుడా వికసించేది
అని ఇక ఆగను మాపంటు ఈడుకొచ్చిన
లేగా దూడలా తొందరపడుట్టున్నాయి !
దాచిన పుప్పొడిని చూపుతూ
విరిసిన పువ్వులు ముగ్దమనోహర
సౌందర్య కాంత వలె సుకుమారంగా చూస్తున్నాయి !
అక్కడక్కడ పిందెలు పెరిగిన
కాయల జూసి వెకిలి నవ్వులు ఆపుమని
రేపటికి పోటి పడుదుమని ఈర్శపడుతున్నాయి !
కడుపులో లెక్కకు అందని గింజతో పండ్లు
రేపటి తారానికి బాటలు వేస్తున్న
గర్భిని వలె ఆపసోపాలు పడుతున్నాయి !
కృష్ణ మణి
తాడుకు అల్లుకున్న తీగలను చూసాను
అవకాశాన్ని అందుకున్నామని మురిసిపోతున్నాయి !
సూర్య కాంతిలో చిగురుటాకుల నిగ నిగలు
ఉద్భవించిన నవ యువ కెరటాలు మాదిరి
ఉప్పొంగిన తేజస్సుతో ఉన్నాయి !
చిట్టి చిట్టి మొగ్గలు నేనెప్పుడా వికసించేది
అని ఇక ఆగను మాపంటు ఈడుకొచ్చిన
లేగా దూడలా తొందరపడుట్టున్నాయి !
దాచిన పుప్పొడిని చూపుతూ
విరిసిన పువ్వులు ముగ్దమనోహర
సౌందర్య కాంత వలె సుకుమారంగా చూస్తున్నాయి !
అక్కడక్కడ పిందెలు పెరిగిన
కాయల జూసి వెకిలి నవ్వులు ఆపుమని
రేపటికి పోటి పడుదుమని ఈర్శపడుతున్నాయి !
కడుపులో లెక్కకు అందని గింజతో పండ్లు
రేపటి తారానికి బాటలు వేస్తున్న
గర్భిని వలె ఆపసోపాలు పడుతున్నాయి !
కృష్ణ మణి
No comments:
Post a Comment