Thursday, January 23, 2014

పెండ్లి


ఒడదింపి అల్లిన
కొబ్బరాకుల గుంజలు
పూల గుత్తులతొ పచ్చని పందిరి
మేడి కొమ్మని గుంజకు గట్టగ
ఎలిగిన దీపం

నెత్తికి భాశింగం
పుసుపు రాశిన మొఖము
చెంపకు చుక్క
చేతిలో అడ్డకత్తెర
మేడలో దండలు
పట్టులో ఒదిగిన గువ్వలు
మెరిశిన కన్నులు

పడతుల ఒంటి నిండా సింగారించిన దగలు
పంతులయ్య పద్యాలు
తాళి కట్టే యాల పిల్లగాని నవ్వులు
తల ఒంచిన పిల్ల
మేడలో మెరిశిన జీవితం
పెద్దల దీవెనలు
అమ్మనాయిన కన్నుల పండుగ

మొదుగాకుల ఇస్తర్లు
ఎర్రగ పరిశిన చద్దర్లు
బగార అన్నం బఠానీ గింజలు
పాలకూర పప్పు సారొంకాయ
సాంబారు శారు అంచుకు మిక్చరు
మైసూర్ పాకు

మస్తుగ జరిగింది పెండ్లి
ఎడూర్ల జనం ఒస్తోల్లు రావట్టే
పోయేటొళ్ళు పోవట్టే

కృష్ణ మణి I 24-01-2014

No comments:

Post a Comment