శీకట్ల
మీదికి సూస్తే మొగులుకు
మసి ఊషినట్లు గమ్మత్తుగా ఉన్నది
ఆడ ఆడ ఇంత కాంతి మెరుపులు !
భుమ్మీద బరువును
పరిది దాటి ఆవతల పొతే
దూది పింజలాగ ఎగురుతూ ఊగుతూ
ఒక్క దగ్గర ఉండనియ్యక
కింద మీద పడుడు జూసి పక పక నవ్వుతున్నట్లు
అందని దూరాన అందమైన సుక్కలు
మినుకు మినుకు మంటున్నాయి
చాల రోజుల నుంచి మతిల ప్రశ్నలకు
జవాబు దోర్కుతదని ఆలోచిస్తున్నా
ఎప్పడికి జువ్వుమని గాలి అరుపులు ఇనుకుంట
మధ్యలో ఎక్కడో దూరాన మిడతల లొల్లి
ఒక తీర్గ అది బయపెడ్తుంది
నాకు స్వర్గం సూడాలనుకుంటున్న
ఇది నరకమా అని ఇంకో వంక బెదురు
అక్కడక్కడ పొగ ముసుర్కుంది
దగ్గరికి జరిగి చూసిన బూజు పట్టినట్టుంది
చెయ్యాల్సిన పనేందో మరిచిపోయినా
ఇంతలనే భూమి ఎనుకకు గుంజుతుంది అనుకుంట
తిరిగి వచ్చు దారిలా తెల్లని తెప్పాలను చూసి
ఇసుంటివి అక్కడ కూడున్నాయనిపించింది
నీలం రంగు నీళ్ళు
భూమి పచ్చగా ఎర్రగా వింతగానిపిస్తుంది
చెట్లమీద చినుకు లెక్క జారి
భూమి మీద పడ్డ కోతి లెక్క
ఏదో సాదించిన గర్వం
గుండెల పొంగుతుంది
No comments:
Post a Comment