ఆకాశాన అందని ఎత్తున ఎవరో ఊ కొడుతున్నారు
ఎవరని ఆ నింగిలో నక్షత్రాల వెనక వెతికాను
దట్టమైన పొగ మేఘాల్ని దులిపి చూసాను
అంతా చీకటి ముందు చిందులేస్తున్న మెరుపులుగ ఉంది
కొన్ని తారలు నాతొ దోబుచులాడుతున్నట్టుంది
అక్కడక్కడ తోక చుక్కల పయనం దీపావళిని గుర్తు చేస్తున్నాయి
ఆ సుందర దృశ్యాలు ఎప్పటి నుంచి అలా ఉన్నాయొనని ఆలోచన
మ్మ్మ్మ్.......... అని చెవుల్లో మారుమోగుతుంది
ఒక గాలి నిరంతరం ఒకేల దివి నిండా వ్యాపించి
ఈ అనంత కోటి బ్రహ్మాండాన్ని శాసిస్తుందనుకుంటా
బహుశ నే విని వెతుకుతున్నా శబ్దం ఇదేనేమో
ఆది అంతం ఉందేమోనని వెతికాను
నిలువుగాన అడ్డంగాన నే వెళ్ళాలి
ఎటు వెళ్ళాలో తెలియక కొంత తిరిగాను
అలసిన మనసున విసుగుతో వెనుదిరిగాను
చటుక్కున మెలుకువ వచ్చింది అలారం గోలకి
అది కల అని నవ్వు రాలేదు
అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది
కృష్ణ మణి I 14-01-2014
No comments:
Post a Comment