Thursday, January 16, 2014

తొవ్వ

కన్నీళ్ళలో కష్టాల పడవలు....
బతుకుపొలం నిండ పరిక్కంప

ఏ గడియల కన్నదో మాయమ్మ నన్ను...
పురిటియాల్ల ఆ తోకచుక్కకు కడుపెందుకు నొచ్చిందో ?
అడుగడుగునా అడ్డమొచ్చే కంపలెన్నో
ఈ తొవ్వ ఆగుడెప్పుడో ? నే పానమిడిశేదెప్పుడో ?

అప్పు జేసి ఇత్తుమందులగొంటే
కండ వుండి చమట చింది
చేసిన కష్టమంతా నీళ్ళ కిందే  !
ఎత్తి పొస్తి మడుగులన్ని
గాలి తిన్న కొమ్మ రెమ్మ
అంతలోనే ఆగనంటు సర్రు సర్రున తెప్పలొమ్పె !

కోతకొచ్చిన పంట
పోట్ట నిండని గింజ
నీళ్ళు ఎండిన బాయి
అడుగువట్టిన బోరు
ఉన్నఅడుగు వోమ్పుతుంటే
లైటు లేక ఎక్కిరిచ్చె !


కూలి కైనా పోదామంటే
పనులు లేక పస్తులాయె
ఏమి చెయ్య తొయలెక
నెత్తికెమొ చెతులాయె
ఉన్నయన్ని అమ్మజూపితి
కడుపుకైన గంజి లేక
లోతుకన్ల దిక్కులాయె
ఎదురుసూపుల ఎండా కింద !

ఎట్ల నడుసుడు మున్దుకింక
ఒమ్పులన్ని మిట్టలాయే !
ఏమి చేదును బతుకుకింక
పురుగుమందే తోడుకాయే !

No comments:

Post a Comment