Tuesday, January 21, 2014

మనసు - మనిషి


ఎండిన కాలాన చినుకే అమృతం
పండిన సమయాన అదే విషం

మనిషి మంచి జరిగిన తట్టుకోలేడు
అలాని చెడు జరిగిన ఓర్చుకోలేడు
పలుచని మనసుకి ఎన్ని కన్నాలొ
ఎదిగిన మనషికి అన్ని అవధులు

మనసు వేదనను భరించదు
మనిషి దెబ్బలు సహించడు

శారీరక గాయాలు కొన్నైతే
మానసిక శ్రమ ఓ పక్క
కష్టించి ఫలితాన్ని పొందే గడియన
అనుకున్నది అందక చింతన
అందింది చూసి మురువక
తనకు తాను నిందనో లేక పరనిందనో

కణ కణమని ఎగసే నిప్పు కణికలు
జల జలమని పొంగే కొండ వాగులు
చక చకమని మెరిసే గడ్డి పోసలు
పక పకమని నవ్వే రామ చిలకలు

లోకాన అన్ని ఓర్పుకాసి నేర్పు చెంత
ఒడిదుడుకుల సహవాసం చేసినవే !

కృష్ణ మణి

No comments:

Post a Comment