Friday, January 24, 2014

ప్రేమ జల్లు


నా ఊహల అరణ్యంలో
పచ్చటి చెట్ల మద్యన అందమైన పూదోట
తోట నడుమ మడుగులో రంగు రంగుల చేపలు
మడుగు అంచున పాల రాతి ఆసనం
దానిపై  నా హృదయ రాణి
కాళ్ళు చాపుకొని తన ఒడిలో తల ఉంచి
అనురాగపు పిల్లనగోవి సమ్మోహన నాదం
వింటూ ఆ మధుర క్షణాలను
ఒక్కొక్కటిని ఆస్వాదిస్తున్నాను
నల్లని కురులని జరిపి
మెరిసే ఎర్రటి పెదాల సుందర బింబాన్ని
రెప్ప పాటు రాకుండ చూస్తూ
తేనే కనుల చూపుల మత్తులో
ఊగుతున్న నా మనసు

స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు
కాని శాశ్వతంగా
ఈ ప్రేమ జల్లులో తడవాలని ఉంది !

కృష్ణ మణి 

No comments:

Post a Comment