ఎండలో దప్పిక
నీళ్ళను ఎరుగక
ఊపిరి వదలక
బతుకుట తప్పక
దొరకునని వదలక
వెతుకుట ఆపక
కలుగును జయమిక !
ఓర్పును చెదరక
దేనికి బెదరక
పరుగులు చక చక
ఉండదు తీరిక
రేపటి రోజిక
ఉండదు తిక మక
అందుకే పోగిక
కలుగును జయమిక !
వణికిన తనువిక
చెదిరిన కలయిక
మాసిన పువ్విక
చేయ్యును రణమిక
ఒరుగును బలమిక
తెగువకు వరమిక
కలుగును జయమిక !
దెబ్బలు మాయక
కారిన కన్నిక
ఎగురును ఎంచక
బలిశల సానిక
కావురం తెగునిక
వచ్చును బదులిక
మోగును ధరువిక
కలుగును జయమిక !
No comments:
Post a Comment