బోసి మొఖమున తేనె పలుకు
''అమ్మ'' అనగ కళ్ళు చేమ్మగిల్లెనో
చిట్టి పాదాలు అమ్మ యదపై ఆడగా
మనసు పులకరించెనో
చేతులెత్తి తండ్రి మీసం తట్టగా
మురిపాన గర్వమొందేనో
బుడి బుడి నడకల
తప్పటడుగుల ఆటలు
ఇల్లంతా గల్లాటతో తడిసెనో
బట్ట కట్టి బడికి వెళ్లి
బలపమాడి
చదువు నేర్చి
లోకమెరిగి
స్థానమెరిగి
దీన జన శోకమెరిగి
మనసు కరిగి
రక్తమ్మరిగి
పంటి అంచున కసిని పట్టి
అడుగులెరిగి
బగ్గ బలిసిన కావరాన్ని అదమ తలచి
పొగరు బట్టిన గిత్తలూరుముల ఎదురు నిలిచి
పెన్ను ఎత్తి మేలుగొలిపి
బడుగు కన్నుల వ్యదను తుడువ ముందు నడచి
లాఠి తూటాలను అడ్డుపెట్టి అణగదొక్కే
రాజనీతుల అహంకారము ఊడగొట్టే
గోళాలై
ఫిరంగి శబ్దాలై
అగ్గి రవ్వలై
బొగ్గు ముక్కలై
ఇనుప చువ్వలై
దంచు సుత్తెలై
వేట బాకులై
తపంచ నొక్కులై
నిలచెను అన్నవై
అడవి గుట్టల
బెదురుమాని
ఎక్కుపెట్టి
రక్తమొడ్డి
నేల రాలి
తిరిగి వచ్చే
తల్లి ఒడికి
జనసంద్రమున సాగెను పూల నావపై
తోటి పక్షుల వెలుగు దివిటివై
చుక్కల్లో ఎర్ర మెరుపువై
ఉందువు కలకాలం బడుగులాశావై
No comments:
Post a Comment