అర్ధ రాత్రి పన్నెండు దాటింది
ఊరవతల మర్రి చెట్టు
చెట్టుకవతల బొందలగడ్డ
మాఓడక్కడ
చెట్టుకింద నేను
వాంతో పాటే పోవాల్సుండే
దూరాన గాలుల ఇంత సప్పుడ్లు
ఆ పక్క కుక్క లొర్లుడు
సుట్టు సల్లగుంది
నాకేమో చమటల్వట్టినయి
ఇంతకీ మేమెందుకొచ్చినమంటే
నా జతోడు పగటిల్ల్య
బర్లుగొట్టుకోనొస్తుంటే
ఆ బొందలగడ్డ మీద
ఏదో బంగారం లెక్క మెరిశిందాంట
పక్కోనికి చెప్తే ఉరికీత ఓయి
ముంగల తీసుకుంటాడని జెప్పలే
తెల్లందాకయితే ఎవరు సూడరని
నన్ను జతకువట్టుకోచ్చిండు
ఆడింక రాడు
నాకేమో భయ్యం
ఆడిదాక రారా అంటే ఓలే
ఈడక్కోన్నైన
ఆడొక్కడయ్యిండు
ఆగుతలేదు పాణం
ఏమో ఒర్లవట్టే వాడు
దమ్ముదీసుకుంట ఉరికిన వొంకుకుంట
కింద వడి కాల్జెయ్యి కొట్టుకుంటుండు
అసలే డర్రుగాన్ని
గుండె జారినట్లయ్యింది
తర్వాతెమయ్యిందో తెల్వదు
తెల్లందాక మా ఇంటోళ్ళు ఆనింటొల్లు
దేవ్లాడిన్రంట
పొదుగల్ల సూశి లేపిండ్రు
అసల్సంగతి జెప్తే కొడతరని
ఏమో మాకెర్కలే అన్నం
దయ్యంబట్టింది కొడుకులకని
కోళ్ళు దిమ్పేశిన్రు
కళ్ళు ఒశిన్రు
కార్జం బోటి సాలన్నదాక పెట్టిన్రు
ఒకరినొకరం సుస్కోని నవ్వుకున్నం
దయ్యమొదిలందని
మురిశిన్రు మాఓల్లు
ఇకజాల్ నవ్వొస్తుంది
No comments:
Post a Comment