Saturday, March 14, 2015

‘’మన్ కి’’ బాత్


_____________________కృష్ణ మణి

సూర్యునికై ఎదురుచూపు ఆ చీకటి కోనకి
వస్తాడని వెలుగు నింపి కళ్ళ ముందు దారి కనపిస్తుందని
ఆలోచన సుడిగుండాలలో పగటి కలలో తోశాడు !

పాపం భానుడికి పక్షపాతం 
పక్షవాతంతో ఉన్న లోకాన్ని చూసి చిన్న చూపు
ఈ గడియలు ఉత్తర దృవం నాకు దగ్గరగా ఉంది
దక్షణ దృవం చీకట్లో ఉండాలని శాశనం జేశావు !

కొండపైన ఉండే స్వార్ధానికి వెచ్చని వెలుగు పంచి
కొండ కింద చీకటి ఉంచి
కొండెక్కించను కాని కొండెక్కండని
కాళ్ళను నరికి దీనుల జేశావు !

నీవే దిక్కని మొక్కితే 
మొక్కులు తీర్చుకోమని దిక్కులేని లోకాన్ని దిక్కున్న చోట
చెప్పుకోమని ‘’మన్ కి’’ బాత్ చెప్పి  
దీనులకి దీపం గతి అని
అర్దరాత్రికే నూనెను దూరం జేశావు !

నీ వెలుగు చుట్టూ పురుగుల జూసి  
అదే బలమని అహంకారామా దీపమా
మరిచితివా నీలో మాడే ఒత్తి మీమేనని అది నువ్వేనని !

కృష్ణ మణి I 01-03-2015      


No comments:

Post a Comment