__________________కృష్ణ
మణి
ఆకాశంల
తెల్లటి తెప్పలు
సుట్టపు
సూపుగా వస్తున్నయి
నల్లటి
గొడుగున తడిసే క్షణం కోసం
గొంతెండిన
ఎదురుసూపుల స్వాతి పిట్టె !
బతుకున
గడ్డుకాలం
అందరికి
కొంతకాలం
కాని
మడుగు సూట్టూ ముసిరే
దూప
జీవులకు ఎల్లకాలం !
ఏడుపు
కన్ను
కారని
నీరు
ఎడారిగా
మారిన
రక్తపు
వాగు !
పరుగుబెట్టిన
ఆవిరి ఊట
అందం
చెదిరిన అడవి బాట
కరువు కేకలే జీవపు నోట
సావు ఆకలే
ఎండిన చోట !
కప్పల
పెండ్లి ఊరువాడ
తెప్పల
కోసం దిక్కుల మొక్కు
దుక్కులు
తడవక
డొక్కదేలిన
రైతన్న పొలికేక పెట్టె !
ఎలినోడి
కడుపుకాల
ఊరిని
ఆరబెట్టి
అడవిని
నలిపి
ఏం గట్టుకపోతవురా
కడకు
కాపటి నడక !
కృష్ణ
మణి
No comments:
Post a Comment