__________________కృష్ణ
మణి
నడుస్తున్నదెటో
అర్ధం కాని గుడ్డి చూపు
ఏ
దిక్కున ఏముందో తెలియదు
కాని
ఆగని గమనంలో గతుకులను దాటుతు మెతుకుల వేట !
ఆలోచనలకి
రూపం దక్కక ఆరు బయట రాలే ఆకులతో ముచ్చట
చిత్రంగా
ఉన్న చింతలో చింత పండు గుర్తుకు వచ్చి
విత్తుల
బరువు ఎక్కిరించింది !
బజారులో
కూరగాయల రేట్లు నవ్వుతున్నాయి
వీడు
కొనే మొహమా అని !
ఎండిన
చెట్టుకింద సంసారం సాగక
మొహం
మాడ్చిన ఇల్లాలు
తిని పడేసిన
ఐస్క్రీం ఖాళి డబ్బాల పలకరింపుతో
బిక్కుమంటున్న
పిల్లల చూపులు !
మనిషి
ఆకలిని మోస్తూ
బతుకు
చక్రం కింద నలుగుతున్నాడు
రైలు
పట్టాలపై అనచబడ్డ రూపాయి బిళ్ళలా !
బయటి
ప్రపంచపు పోకడలను అందిపుచ్చు కోక
లోపలి ప్రపంచమే
మేలని చెప్పుకొనే
అసహనపు
చాందస దోరణిలో సామాన్యుడి వింత దర్పం
బాహర్ శేర్వాని
అందర్ పరిశాని అన్నట్లు !
కృష్ణ
మణి
No comments:
Post a Comment