Monday, February 2, 2015

నగరం


____________________కృష్ణ మణి
అదో సుందర నగరం
ఆకాశంలోని చుక్కలు నెలకు దిగిన వైనం
ఎటు చూడు పచ్చటి ఆకుల నడుమ ఇంద్రధనుస్సు వర్ణాలు
అభిషేకానికి నిండుగా పొదుగుతున్నవి !

అడుగు అడుగున మడుగులలో
తీరొక్క రంగు చేపలు జలకాలాడుతూ 
వెచ్చని తనువును మురిపెంగా సపర్యలు చెయ్య
మిల మిలమను కన్నులతో పలకరిస్తున్నవి !

కోయిలమ్మలు ఇంపగు రాగాలతో
వసంతాలాపన చేస్తు మత్తును జల్లుతూ  
నెమల్లు సరిరారు మాకేవ్వరు అంటు లోకం మెచ్చేలా  
నయనానంద వర్ణాలతో ఉల్లాసంగా నర్తిస్తున్నవి !

జింకలు కుందేళ్ళు తమ అల్లరి గెంతులతో
కనులకు విందుగొలుపుతూ  
రామచిలుకలు సీతాకోకచిలుకలు గుంపులుగా చేరి
ఎటుచూడు ఆహ్లాదం నింపుతున్నవి !

నా మది నగరం నిండుగా తొలికె పాల కడవలా ముస్తాబై
ఏలే మహారాణి ఎవరని ప్రతి క్షణం
కనుల ముందు కలయాడె పాదాలలో వెతుకుతూ
తామరాకు గుణంలాంటి పాదానికై పరితపిస్తుంది !

కృష్ణ మణి  I 31-01-2015




No comments:

Post a Comment