ప్రకృతి ఒడి
చేతులు చాచి కొండ అంచున నిలబడి
తెల్లని మేఘ చారాల నీలాకాశానికి చూసాను
ఆ నిర్మల దృశ్యం చిరునవ్వుతో నను పసిపాపలా హత్తుకొంది
!
ఏటిగట్టున చేతికర్రతో పచ్చని తామరాకులను జరిపి
చూసాను
చిట్టి పొట్టి చేపలు నను మిత్రునిగా తలచి దోబూచులాడాయి
!
పచ్చని చెట్ల మధ్య గంధర్వ నాదం చేస్తున్న
ఆ కోయిల గొంతు నా ఏకాంతానికి తోడై మాట్లాడింది !
ఓ ఉడుత ఓ కుందేలు ఓ లేడి ఓ తుమ్మెద
నా కనుల ముందు నవ్వుల పువ్వులు పూయించాయి !
ఆ నీడన అలసట తీరుతుందని వెన్ను వాల్చాను
చల్లటి పిల్ల తెమ్మరలు పసిపాపగా చేసి జోల పాడాయి !
సకల జీవం ఇల్లు చేరే వేల అస్తమించే సూర్యుని ముందు
కొండాకోనల కునుకుపాటు నను నిద్రపుచ్చింది !
Krishna mani
No comments:
Post a Comment