పిలుపు
____________________________కృష్ణ మణి
కొత్త పరిమళంతో ఉత్తేజంగా ఉంది మనసు
ఏమో ఒక కొత్త పరిచయం
కొత్త ప్రపంచానికి తీసుకేల్తుందేమో !
కరి మబ్బుల నీడలో తడిసిన వయసును ఆరబెట్టుక
కూర్చున్నా
తుంటరి సూర్యుడు తొంగి చూస్తాడని
రెక్కలు విప్పుకొని నిలబడ్డాను
గాలి తరంగాలపై ఊయల ఊగుతూ !
వాగులు వంకలు తడిసి ఎదో వింత అలికిడి
నన్ను గిళిగింతకు గురి చేస్తుంది
వాడిన తనువు పులకరిస్తున్నదని
ఆ చిగురుటాకులు చెబుతున్నాయి !
ఆకలి తీరినా మనసు నిండక తోడుకోరకై అంతా పరుగులు
సొగసులద్దుకొని కొత్త రూపుతో సంబరాలు చెయ్యమని
పిలుపు !
కృష్ణ మణి
No comments:
Post a Comment