దిక్కుల మొక్కులు
___________________కృష్ణ మణి
ఏం పరిశాన్ల కుసున్నవ్ పాపన్న
మొగులు మీద ఆగమయిన నల్ల తెప్పల కోసమా
నీటి సుక్క కోసం నీల్లెని బాయిల నిలవడ్డట్లుంది
కదే !
అరిగోస వేట్టవట్టే ఈ త్యాప వాన దేవుడు
ఏడ సూడు కన్లళ్ళ ఎడారి తోవ్వలె కన్పిస్తున్నై
ఏడ సూడు దుక్కిల నోర్లు తెరిసిన పర్రెలు
ఎండల వెట్టిన ఒట్టి శాపలోలె !
మోల్కవట్టని పత్తిత్తులు ఎండిపోయిన ఒరి నారు
మడిమలల్ల పర్రెలిడిశిన ఒరంమీది పాదాలు
బొక్కలకంటిన డొక్కలు దూపదీరని కోపాలు
బురద దేలిన బొందలల్ల బతుకుతిప్పల శాపాలు !
కప్పల పెండ్లిళ్ళు
ఇంగలాల గుండాలు
చెయ్యి జాపిన నమాజులు
కండ్లు మూసిన గంగ కోసం నోర్లు తెరిశిన దిక్కులు
పచ్చ చద్దరు దాపు కోసం కోటి దుక్కుల మొక్కులు
!
ఇంకేప్పుడే పాపన్న ?
కృష్ణ మణి I 05-07-2014
No comments:
Post a Comment