ఎటో
_____________________కృష్ణ మణి
పరిగెత్తే పసి వాగుల గమ్యమెటో
రెప్పమాటునా కారే నీటి ఊటలెన్నో
రోడ్డుపై పవళించే మొగ్గవాడే బతుకులెటో
మాసిన గుడ్డలతో పోరాడే చెదిరిన జుట్టెటో
కుప్పలపై కుళ్ళిన కాయల చూపులెటో !
అటో ఇటో ఎటో తెలియని పిల్లగాలుల పయనమెటో
కనికరం లేని కసాయి చూపుల కత్తుల అంచున తెగుతున్న
బాల్యలెన్నో !
గత్యంతరం లేని కావడి నడక
ఇష్టమయిన పాయసం కానీ పాచిన తిండే కరువు
నడిచే దారుల్లో నవ్వే పువ్వుల చూసి మురిసే ఆకలి
కేకలు
దొంగలుగా మారుస్తున్న దొరల అహంకారం
దొంగలుగా రాజ్యదోపిడి చేసి పసి కాంతులను మసి చేసే
గుడ్డి సూదులు
గగనానికి నిచ్చేనలేసే గుండెల్లో రగులుతున్న మంటలు
మేమేక్కడికెల్లాలని ప్రశ్నిస్తున్న కరుగే ఐస్
బర్గులు
No comments:
Post a Comment