జారుడు బండలు
___________________కృష్ణ మణి
గడిచిన గతాల మరుగు మాటలకు సమాది కట్టుమని మది
చెప్పింది
ఎండిన అడుగున నీరు చేరి సాగుకు నాగలెత్తమని బంజరు
నవ్వింది !
ఆ బూరుగుచెట్టు ఆకు తొడిగి
దశాబ్దాల గాట్లకు సాక్షినని ధైర్యంగా నిలబడింది
డంగు సున్నం కరిగి
కోటలు బీటలయ్యి అన్యాయానికి సెలవన్నది !
ఆగని పరుగున ఆరని మంటలు
చల్లబడి గమ్యం చేరి
ఆనందాన కన్ను గార్చినవి
కొలనుల కమలాలు విచ్చుకొని
చీకటి మాసిన వెలుగులో మురిసినవి !
కొత్త లోకం
కొత్త పోకడ
కొత్త తంతు
పాత లెక్కలను ముక్కలు చేసినవి
అరిగిన రాళ్ళే నునుపు తేలి
రేపటి పిల్లల జారుడు బండలయినవి !
కృష్ణ మణి I 20-08-2014
No comments:
Post a Comment