జాగ్రత్త
____________________కృష్ణ మణి
నిను మొదటిసారి అమ్మ ఒడిలో చూసిన క్షణం
నేపొందిన ఆనందం చెప్పలేనురా
బుడి బుడి నడకల మెత్తటి పాదాలు నా యదపై ఆడగా
దూది పింజలతో కలిసి నా మనసు విహరించిందిరా !
నా వేలు పట్టుకొని నడుస్తుంటే
నలుగురు నను హీర్షగా చూడగా నా కొడుకని గర్వంగా
నడిచాను
నువు హోంవర్క్ చేస్తుంటే నా చిన్నతనంలో
పలకపై అక్షరాలు దిద్దిన రోజులు గుర్తుకొచ్చేవి !
బ్యాట్ పట్టుకొని పరిగెడుతుంటే గిల్లి దాoడు
క్యారం బోర్డ్ ఆడుతుంటే అష్టాచెమ్మ ఇంకా చాలానే
.....
నీ తుంటరి తప్పులు నా జ్ఞాపకాలను నెమరేసివి
తల్లి లేని కొడుకని గారభమనుకుంటా
అందుకే పెద్దవాడివయ్యాక నీ జీవితం నీకే వదిలేశా !
నచ్చిన అమ్మాయిని కోడలిగా చూపించావు ఆశీర్వదించాను
నీ కళ్ళ ముందు ఇక నేను లేను కాని
నా మనవరాలులో మీ అమ్మను చూసానురా జాగ్రత్త !
కృష్ణ మణి I 26-06-2014
No comments:
Post a Comment