నువ్వు నేను
__________________కృష్ణ మణి
నేనేమనుకుంటానో నీకు తెలియదు కాని
నేనేమంటానో నీకు తెలుసు
ఏమో నీ కళ్ళు నా కళ్ళని వేటాడుతాయేమో !
ఏమో కలవని దారులు కలుస్తాయని నీ ఊహ
కలిసే చేతులు కదలని మనసుల్ని మోస్తాయేమో !
గగనమైన పలుకుకు నీ వెతులాట నవ్వు తెప్పిస్తుంది
ఒకే చోట ఉంటాము ఒకే చోట కాలం గడుస్తుంది మనది
ప్రవాహంలో కొట్టుక పోతున్న విడి పడిన ఆకులం !
నా తలపు అంచున ఆరాటం కనులపై తెలుపని వైనం
నా మనసు రాయి అని నీ మనసు చెప్పినది నిజం కాదు
రాయిలా కనిపించిన వెన్నలాంటి మెత్తదనం నాది
గజి బిజి పాకులాటలో గమ్యం కానని గమనం !
అర్ధం కానీ అమాయకపు మనసుకు అహంకారపు అలంకరణ
కొన్ని క్షణాలు గడిపిన జ్ఞాపకాలను నెమరు
వేస్తుంటాము విడి పడిన క్షణం నుండి !
కృష్ణ మణి I 14-07-2014
No comments:
Post a Comment