***********
ఒక చెట్టులో దాగి చూసా
పక్కవాడి కడుపు నింపడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !
కోతిలో చేరి
చూసా
కొమ్మలంచులో ఊగే సుఖం ఇంకోటి లేదు !
ఒక పాములో దిగి చూసా
ఒళ్ళు చుట్టుకొని మత్తున పండే సుఖం ఇంకోటి లేదు !
ఒక పక్షిలో ఎగిరి చూసా
లోకాన్ని చిన్నగా చూసి మురిసే సుఖం ఇంకోటి లేదు !
సాగరంలో మునిగి చూసా
సాధ్యమైనంత ఎక్కువగా ఒదగడంలో ఉన్న సుఖం ఇంకోటి
లేదు !
ఒక పందిలో ప్రవేశించి చూసాను
బురదలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !
చివర ......మనషిలో తొంగి చూసా
పక్కవాడిని తొక్కడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !
కృష్ణ మణి
I 19-04-2014
No comments:
Post a Comment