Tuesday, May 13, 2014

జాము రాతిరి


*********

జరగనీ జాము రాతిరి
అడుతా ఆనందంగా మనసును విహరింపజేస్తూ
నల్లని లోకంలో ఎందరో రవిలు !

ఒక్కొకరిని పలకరించి పరవశిస్తా
మనకెరుగని గోడులున్నాయేమో అడిగోస్తా
మనకన్నా కష్టాల్ నష్టాల్ విని వస్తా
బతుకు భారం నిత్య అగాదం
మనసు విరిగిన గుండెలను కదిపొస్తా
కళ్ళు నిండి మెరుస్తున్న రంగులను చూసొస్తా !

 
మన రవే బగ్గుమనే అగ్గిగోళం
తన గాధ వినుమని ఉబలాటం
అందుకే పొద్దు పొడిచి కళ్లుమూయును
ఇంకెవరిని చూడకండని ఆరాటం !

కృష్ణ మణి I 09-04-2014


No comments:

Post a Comment