మానవ వికృత విలయాన్ని చూసి
లయకారకుడే లబలబమన్నాడు
సిగ్గులేని మానవకాకి శృంగారానికి వరస
ఏదైతేనేమన్నాడు
వయసేదైతేనేమన్నాడు
పసి ఆకులను చిదిమేసిన చచ్చువెదవ !
కనికరంలేని కసాయికేది దొరికిన వదలడు
పాపం కళ్ళులేని కత్తికేమి తెలుస్తుంది కోసేది
పీకని
శవాల దిబ్బల ధర్మాసుపత్రి
డబ్బులు రాలందే చచ్చిన మనోడు బయటకు రాడు
దాపులేని బతుకుకు రోడ్డే దిక్కైతే
లారీ టైరు కింద ఇస్త్రీ !
ఆకలికడుపున ఆపద్బందువని కొట్టిన జేజేలు
ఓటువేసేటప్పుడు గుర్తుకొచ్చేది వెయ్యినోటు సారసీస
మనోడు ఏమిచేయ్యకపోయినా సరే పక్కకులంవాడు రావొద్దు
గద్దెనెక్కిన గలీజోడు దిగేదాకా పందికొక్కు
మానవత్వం మరచిన మనిషి మరుభూమిలో పురుగు !
కుళ్ళిన లోకంలో కురువని విషం ఎక్కడా ?
కృష్ణ మణి
I 12-05-2014
No comments:
Post a Comment