******
ప్రకృతి మోడువారిన క్షణాన నా కంట కారేది నీరేనని
మురిసిన మనసు
ఆ చుక్కలని పట్టి ఒక మొక్కకన్న నింపలేనా కడుపునని
రగిలిన గుండె
ఎండిన చర్మం
పగిలిన కాళ్ళు
ఆరిన చమట
రాలిన ఉప్పు !
ఇలా మానవులు హహాకారాలు చేసి
కార్చిన నీళ్ళను బిందెలో నింపి ప్రకృతి పాదాలను
తడపినా
కరుణించని తల్లి
కసాయి సూరీడు !
ఎడారి నడకన ఎండమావుల పలకరింపులు
క్షణానికైనా మదిలో సంబురం !
బొగ్గుల కొలిమిలో బతుకు నడవక
బూడిదలో దాగిన ఆశ !
చేసిన పాపము చెడని పదార్దం
చినుకు జారక ముందే మదిని తెరచి దాచుము విత్తు
కొనజేరిన జీవనాడికి పచ్చని పందిరి అల్లుము మొద్దు
!
కృష్ణ మణి I 27-04-2014
No comments:
Post a Comment