నన్ను కాల్చి నన్ను కొట్టి నన్ను ఒంచి
ఒక ఆకారాన్ని ఇచ్చి
నన్ను మనిషికి మిత్రున్ని చేసిన చేతులకు వందనాలు !
బతుకు నడకలో మనిషికి తోడునై
నేలకు గాట్లు పెట్టె నాగలి మొననై
కలుపులేరే కల్వారనై
పంట కోసే కొడవలినై
యంత్రమై
నాగరికతలో భాగమై
మనిషి ద్వారా ఎంతో ఎదిగాను కాని ,
మనిషి అనాగరిక లక్షణాలను మాత్రం వదలలేదు
అందుకే మల్లి కణకణ మణి నిప్పుల కొలిమిలో దాగి
కూర్చున్న
కమ్మరి మనసున కసిని చూస్తున్న
లోకం తీరులో చీకటి బేతాలలను చూస్తున్న !
బీదల బిక్కుల బాదల కేకలు వింటున్నా
కన్నవారినే కడతేర్చే కసాయి పాపాత్ముల చూస్తున్న
బేలపై అడివి మృగాల ఆకలి చూస్తున్న
తెల్ల బట్టల్లో మెరిసే నల్లని మనసుల్ని చూస్తున్న
ఆన్యాయాన్ని ఆటగా చూసే వెకిలి నవ్వుల నోళ్లను
చూస్తున్నా !
నీచుల తలలు నారికే గండ్ర గొడ్డలిగా మారాలని
చూస్తున్న
చేతినేత్తి నన్ను పట్టే మనిషి కోసం ఎదురు
చూస్తున్నా !
కృష్ణ మణి I 06-05-2014
No comments:
Post a Comment