Sunday, October 4, 2015

బంగారం

బంగారం
___________________కృష్ణ మణి

నీ చిట్టి చేతులు మృదువుగా
నా చెంపలను తాకగా
పగలు రాత్రి తేడా తెలియక
అన్ని పనులు మానుకొని నీతోనే గడపాలనుంది బంగారం !

అలసిన తనువుతో ఇల్లు చేరిన నాకు
నీ బోసినవ్వుతో ‘’ డాయి ‘’ అంటుంటే
మనసు తెలీకై
ఆక్సిజన్ అందిన పేషంట్ అవుతాను బంగారం !

బంగారం నీకు తెలియదు
నా జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులు
అందుకే నీకెలాంటి లోటు రావొద్దని తాపత్రయం !

అప్పుడప్పుడు నువ్వు
తడి తడిగా అర్ధం కాని సైగలతో మా మెదడుకు పదును పెడుతుంటే
భలే ముద్దోస్తావు బంగారం !

నిత్యం నీ నవ్వుల పూదోటలో
పసి పిల్లల్ని చేసి ఆడిస్తున్నావు తెలుసా
నీ పసిపాదం గుండెలపై ఆడుతూ
మమ్మల్ని ఊయ్యల్లో ఊపుతున్నావు బంగారం !

మీ అమ్మ వ్రతం చేసింది
బంగారంలాంటి బొమ్మను ఇమ్మని
ఇప్పుడు ఇల్లంతా సందడి
విరిసిన పువ్వుల తోటలా !


కృష్ణ మణి 

No comments:

Post a Comment