జీవితం – నరకం
__________________కృష్ణ మణి
కాలం క్షణాలపై పరిగెడుతూ
మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
క్షణం తర్వాత ఏందో తెలియక మెదడుకు పరీక్ష పెడుతూ !
నిత్యం నరకంలో జీవితం
స్వర్గం కోసం పాకుతూ
నరకంలోనే సాగుతూ నరకంలోనే చస్తుంది
స్వర్గమనేది ఉందని
అది అందలేదని తనలో తానే మదనపడుతూ !
తన ఊహనే నిజమని
పరాయిది దోషమని
నిర్దోశిననే గర్వంతో తనకు తానే దోషిగా మిగులుతుంది !
కనులతో కన్నది స్పష్టమైయినా
తన వారిని వెనకేసుకోవడం ధర్మమని
అధర్మాన్నే నెత్తినెత్తుకొని ఊరేగుతుంది !
తన గొప్పకోసం
పక్కోడిని వంచుతూ దించుతూ
జీవితమంటే ఎర్రబుగ్గ దర్జానని
రాజకీయమని రంగులుమారుస్తుంది !
కృష్ణ మణి
No comments:
Post a Comment